World Rowing Cup | చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రోయింగ్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్..!
World Rowing Cup | స్విట్జర్లాండ్ లూసెర్న్‌లో జరిగిన 2026 వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో భారత జోడీ లక్ష్య్, ఉజ్వల్ కుమార్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి తొలిసారి వరల్డ్ రోయింగ్ కప్ స్థాయిలో బంగారు పతకం అందించారు.
World Rowing Cup | స్విట్జర్లాండ్ లూసెర్న్‌లో జరిగిన 2026 వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో భారత జోడీ లక్ష్య్, ఉజ్వల్ కుమార్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి తొలిసారి వరల్డ్ రోయింగ్ కప్ స్థాయిలో బంగారు పతకం అందించారు. భారత జోడీ 6 నిమిషాలు 26.09 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి హాంకాంగ్ (6:27.14), నెదర్లాండ్స్ (6:27.36) జట్లను స్వల్ప తేడాతో వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ రేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ రోయింగ్‌లో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లయింది. ఇప్పటివరకు వరల్డ్ రోయింగ్ కప్ స్థాయిలో భారత్‌కు స్వర్ణ పతకం గెలువలేదు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. విజయం సాధించిన లక్ష్య్, ఉజ్వల్ కుమార్ సింగ్ ఇద్దరూ భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. అంతేకాదు ఈ టోర్నమెంట్‌కు వెళ్లిన భారత బృందంలోని మొత్తం 18 మంది క్రీడాకారుల్లో 17 మంది ఆర్మీకి చెందినవారు కాగా.. ఒకరు నేవీకి చెందినవారు. ఫైనల్‌లో హాంకాంగ్‌కు చెందిన వరల్డ్ రోయింగ్ కప్ I విజేతలు లామ్ సాన్ టంగ్, చాన్ టిక్ లంగ్ జోడీని వెనక్కి నెట్టడం భారత్ సాధించిన విజయానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. కాంస్య పతకాన్ని నెదర్లాండ్స్ జోడీ ఎరిక్ వాన్ ఈజ్క్ వాన్ హెస్లింగా, ఫెరిక్ ప్లాగ్ దక్కించుకున్నారు.
ఈ చారిత్రక విజయంపై భారత సైన్యంలోని ఆర్మీ రోయింగ్ నోడ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది. “భారత రోయింగ్ చరిత్రలో ఇదే తొలి బంగారు పతకం” అని పేర్కొంటూ క్రీడాకారుల కృషిని ప్రశంసించింది. ఆర్మీ రోయింగ్ నోడ్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రామకృష్ణన్ మాట్లాడుతూ “ఇది భారత రోయింగ్‌కు చారిత్రక క్షణం. లక్ష్య్, ఉజ్వల్ కుమార్ సింగ్ ప్రపంచ స్థాయిలో భారత్‌కు తొలి బంగారు పతకం అందించారు. వారి విజయం సంవత్సరాల శ్రమ, క్రమశిక్షణ, అత్యున్నత స్థాయి శిక్షణ ఫలితం. ఇది భారత ఆర్మీకి మాత్రమే కాకుండా దేశానికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. ఈ విజయం భారత రోయింగ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒలింపిక్ స్థాయిలో మరిన్ని విజయాలను సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Movie Teaser | పొలిటికల్ లీడర్‌గా డిస్కో శాంతి కొడుకు - స్టూడెంట్ టీజర్ రిలీజ్
- ●Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్
- ●Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
- ●Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
- ●Kavya Maran - Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ - ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Movie Teaser | పొలిటికల్ లీడర్‌గా డిస్కో శాంతి కొడుకు - స్టూడెంట్ టీజర్ రిలీజ్

Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు





