త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ar Rahman Son | రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ఏఆర్ ర‌హ‌మాన్ కొడుకు

ఏఆర్ ర‌హ‌మాన్ త‌న‌యుడు అమీన్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. అమీన్ ప్ర‌యాణిస్తున్న కారు ఓ క్యాబ్‌ను ఢీకొట్టింది. సోమ‌వారం తెల్ల‌వారజామున చెన్నైలోని గిండి స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

N

Entertainment | Published On Aug 10, 2026, 6.09 pm IST

Ar Rahman Son | రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ఏఆర్ ర‌హ‌మాన్ కొడుకు
Advertisement

Ar Rahman Son |  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ ర‌హ‌మాన్ కొడుకు ఏఆర్ అమీన్‌కు పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.ఆమీన్ ప్ర‌యాణిస్తున్న కారు చెన్నైలో ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో అమీన్‌తో పాటు అత‌డి స్నేహితుడు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. గిండీలోని ఒలింపియా టెక్ పార్క్ స‌మీపంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

క్యాబ్‌ను ఢీకొట్టి...

అమీన్ త‌న స్నేహితుడితో క‌లిసి కోయంబేడు నుంచి గిండికి కారులో వెళుతున్నారు. గిండి క‌త్తిపార ఫ్లై ఓవ‌ర్ స‌మీపంలో ఉండ‌గా ఓ క్యాబ్ హ‌ఠాత్తుగా వారి కారుకు అడ్డుగా వ‌చ్చింది . అమీన్ కారు అదుపుత‌ప్పి ఆ క్యాబ్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అమీన్‌తో పాటు అత‌డి స్నేహితుడు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. క్యాబ్‌లో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తికి కూడా దెబ్బ‌లు త‌గిలిన‌ట్లు స‌మాచారం. స్థానికుల సాయంతో ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు చేరుకున్న అమీన్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. చిన్న గాయాలే కావ‌డంతో వైద్యులు అత‌డిని డిశ్చార్జ్ చేశారు. ప్ర‌మాద తీవ్ర‌త‌కు అమీన్‌ కారు దెబ్బ‌తిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై కేసును న‌మోదు చేసిన పోలీసులు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సింగ‌ర్‌గా...

తండ్రి ఏఆర్ ర‌హ‌మాన్ బాట‌లోనే సంగీతం వైపు అడుగులు వేస్తోన్నాడు అమీన్‌. సింగ‌ర్‌గా థ‌గ్ లైఫ్‌, కాద‌లిక్కా నేర‌మిళ్లైతోపాటు మ‌రికొన్ని త‌మిళ సినిమాల్లో పాట‌లు పాడాడు.

 

 

 

Advertisement
Advertisement