AR Rahaman | వాఘా బోర్డర్ వద్ద ఆస్కార్ విన్నర్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ – వీడియో వైరల్
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పంజాబ్‌లోని వాఘా - అట్టారీ బోర్డర్ వద్ద ఆదివారం లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహించారు. మై వాపస్ అవూంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ లైవ్ మ్యూజికల్ షోలో పలు దేశభక్తి గీతాలను ఆలపించారు రహమాన్. ఈ షోకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అటెండ్ అయ్యారు.
Entertainment | Published On Jun 8, 2026, 4.00 pm IST
AR Rahaman | ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ వాఘా - అట్టారి బోర్డర్ వద్ద లైవ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దేశ రక్షణలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది త్యాగాలకు నివాళిగా ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌ను నిర్వహించారు. ఈ లైవ్ షోలో పలు దేశభక్తి పాటలు ఆలపించి ఆహుతులను ఆలరించారు రెహమాన్.
బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్...
బాలీవుడ్ మూవీ మై వాపస్ ఆవూంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌ను ఆదివారం వాఘా - అట్టారీ బోర్డర్ వద్ద నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజికల్ షోలో ఏఆర్ రెహమాన్, సింగర్ మోహిత్ చౌహన్, డైరెక్టర్ ఇంతియాజ్ అలీతో పాటు బాలీవుడ్ హీరో వేదాంగ్ రైనా పాల్గొన్నారు.
తొలి మ్యూజిక్ డైరెక్టర్...
ఈ మ్యూజికల్ కాన్సెర్ట్‌లో సింగర్స్ తో కలిసి రహమాన్ మా తుజే సలామ్, జైహో, వందేమాతరంతో పాటు పలు పాటలు ఆలపించారు. రహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌కు భారీ సంఖ్యలో జవాన్లతో పాటు ప్రేక్షకులు హాజరయ్యారు. రహమాన్ పాటలు, ప్రేక్షకుల హర్షద్వానాలతో వాఘా బోర్డర్ మొత్తం మారుమోగింది.
తొలి మ్యూజిక్ డైరెక్టర్...
వాఘా బోర్డర్‌లో లైవ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ నిర్వహించిన తొలి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఘనతను సాధించారు. ఇటీవలే పెద్ది మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగులో పెద్ద హిట్‌ను అందుకున్నారు ఏఆర్ రహమాన్. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే 290 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
దేశవిభజన కథతో...
1947లో ఇండియా - పాకిస్థాన్ దేశవిభజన నేపథ్య కథతో మై వాపస్ అవూంగా మూవీ తెరకెక్కుతోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వేదాంగ్ రైనా, శర్వరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

Ram Charan | రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్పులు.. జాన్వీ, శృతి గ్లామర్ రచ్చ.. హల్లల్లల్లో ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్!
మే 24, 2026

Peddi Trailer | పెద్ది ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్ – ఆస్కార్ విన్నర్ లైవ్ పర్ఫార్మెన్స్ – గ్రాండ్‌గా ఈవెంట్
మే 9, 2026
తాజావార్తలు
- ●Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
- ●Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- ●Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?
- ●Bandi Sanjay vs Etela Rajender | ఆ పోస్టర్ల వెనక ఉన్నది కేంద్రమంత్రేనా?

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!

Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!



