AR Rahman | తెలుగులో మరో సినిమా పట్టేసిన ఏఆర్ రెహమాన్..!
AR Rahman | ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
Entertainment | Published On Feb 11, 2026, 3.31 pm IST
AR Rahman | ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీకి సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన సంవత్సరాల తర్వాత తెలుగులో నేరుగా సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ సెన్సేషనల్‌గా నిలించింది. రెహమాన్ మ్యాజిక్ ఈ మూవీపై భారీ అంచనాలను పెంచాయి. మిగతా పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే రెహమాన్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆయన సైతం ఆయా ప్రాజెక్టులను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో భారీ ప్రాజెక్ట్ కోసం రెహమాన్‌తో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కాంబో సెట్ అయితే మెగా అభిమానులకు పెద్ద మ్యూజిక్ ట్రీట్‌గా చెప్పొచ్చు. అలాగే, విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్టుకు సైతం రెహమాన్ మ్యూజిక్ అందించే అవకాశాలున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం రెహమాన్‌ను సంప్రదించినట్లు సమాచారం. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులు సైతం చర్చలో దశలో ఉన్నాయి. ఈ చర్చలు పట్టాలెక్కితే రెహమాన్ మరోసారి టాలీవుడ్‌ను తన మ్యూజిక్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల రెహమాన్ మతం, కెరీర్ విషయంలో ఓ పాడ్ కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. సుమారు ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి తన మతపరమైన నేపథ్యం ఒక కారణం కావచ్చని, పరిశ్రమలో ఒక వర్గం తనపై వివక్ష చూపిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగగా.. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తనకు ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదని, తన మాటలను సందర్భం నుంచి వేరు చేసి చూశారంటూ రెహమాన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






