త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Rajesh | నాయుడు రాజకీయాలు టార్గెట్ – ఐశ్వ‌ర్య రాజేష్‌ తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగులో ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇస‌క‌ప‌ట్నం పేరుతో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ తెలుగు వెబ్‌సిరీస్‌లో స‌ముద్ర‌ఖ‌ని, సునీల్‌, న‌రేష్ అగ‌స్త్య‌, సుధాక‌ర్ కొమాకుల కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

N

Entertainment | Published On Jun 11, 2026, 3.42 pm IST

Aishwarya Rajesh | నాయుడు రాజకీయాలు టార్గెట్ –  ఐశ్వ‌ర్య రాజేష్‌ తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్‌
Advertisement

Aishwarya Rajesh | టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్ వైజాగ్ రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టింది. నాయుడు అన్యాయాల‌పై పోరాటానికి సిద్ధ‌మైంది. ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగులో ఇస‌క‌ప‌ట్నం పేరుతో ఓ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సిరీస్‌లో స‌ముద్ర‌ఖ‌ని, న‌రేష్ అగ‌స్త్య‌, సుధాక‌ర్ కొమాకుల‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌శాంత్ ర‌గ‌తి క‌థ‌ను అందించారు.

అమెజాన్ ప్రైమ్‌లో...

ఇస‌క ప‌ట్నం వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

నాయుడు అధికారం...

1990 బ్యాక్‌డ్రాప్‌లో ఇస‌క‌ప‌ట్నం వెబ్‌సిరీస్ రూపొందింది. ఇస‌క‌ప‌ట్నం పోర్టు నాయుడి ఆధీనంలో ఉంటుంది. సాధార‌ణ వ్య‌క్తిగా ఊరిలో అడుగుపెట్టిన నాయుడు బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎలా ఎదిగాడు? అత‌డి అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను ఎదురించి ఓ మ‌హిళా ఎలాంటి పోరాటం సాగించింది అనే అంశాల‌తో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది.
తెలుగులో ఐశ్వ‌ర్య రాజేష్ చేస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్. ఇందులో ఓ యాక్ష‌న్ రోల్ చేస్తోంది. గ్యారీ బీహెచ్ గ‌తంలో క్ష‌ణం, హిట్‌, ఎవ‌రు, అశ్వ‌త్థామ‌తో పాటు ప‌లు సినిమాల‌కు ఎడిట‌ర్‌గా ప‌నిచేశాడు. నిఖిల్ స్పై మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మూడు సినిమాలు....

ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగులో మూడు సినిమాలు, రెండు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. తెలుగులో నాగార్జున వందో మూవీ, సుమంత్ మ‌హేంద్ర‌గిరి వారాహితో పాటు ఓ సుకుమారిలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇస‌క‌ప‌ట్నంతో పాటు మూడు లాంత‌ర్లు పేరుతో తెలుగులో మ‌రో వెబ్‌సిరీస్ చేస్తోంది.

 

Advertisement
Advertisement