Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!
Yuvraj Singh | టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగర్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే ఐపీఎల్‌లో కోచింగ్ బాధ్యతలను స్వీకరించనున్నాడు. 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరనున్నాడు.
Yuvraj Singh | టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగర్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే ఐపీఎల్‌లో కోచింగ్ బాధ్యతలను స్వీకరించనున్నాడు. 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరనున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన యువరాజ్ ఇటీవల శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, అబ్దుల్ సమద్ వంటి అనేక మంది యువ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరించాడు. అలాగే, సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లకు సైతం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు.
వాస్తవానికి 2019లో క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత అధికారిక కోచింగ్ స్టాఫ్‌లో చేరలేదు. అయితే, రెండేళ్ల పాటు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రాంఛైజీలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంలో యువరాజ్ చేరనున్నాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా, ఎస్ఏ20 (SA20) లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా గంగూలీ కొనసాగుతున్నాడు. జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఈఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ దిగ్గజ సంస్థల ఉమ్మడి యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్, డబ్ల్యూఎల్‌లో ప్రతీ రెండేళ్లకోసారి జట్టు నిర్వహణ బాధ్యతలను మారుస్తూ వస్తోంది.
జీఎంఆర్ ఆధ్వర్యంలో 2025-2026 సీజన్లలో అక్షర్ పటేల్ కెప్టెన్‌గా, హేమంగ్ బదాని హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. అయితే, జట్టు నిలకడగా రాణించలేకపోయింది. ఆయా సీజన్లలో జట్టు వరుసగా ఐదవ, ఆరవ స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యువరాజ్ తన కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. యువరాజ్ 2024 నుంచే ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరతాడన్న చర్చ మొదలైంది. కానీ, ఇప్పటి వరకు మాత్రం అది జరుగలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ను సాధించలేకపోయింది. 20వ సీజన్‌లో యువరాజ్ రాకతోనైనా తమ అదృష్టం మారుతుందని యాజమాన్యం ఆశిస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Indian Whisky Market | స్కాచ్‌కు 'దేశీ' బ్రాండ్స్ చెక్.. గ్లోబల్ మార్కెట్లోనూ ఇండియన్ విస్కీలదే హవా!
- ●Rare Blood Disorder Pregnancy | అరుదైన వ్యాధి.. ముగ్గురు శిశువుల మృతి.. ఆపై మృత్యువును జయించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- ●Techie Salary 40 LPA | రూ.40 లక్షల ప్యాకేజీ వస్తున్నా నేను పేదవాడినే.. కనీసం ఇల్లు కూడా కొనలేకపోతున్నా: టెక్కీ ఆవేదన
- ●Delhi Baby Trafficking | ఢిల్లీలో 'బేబీ బజార్'.. మగ పిల్లాడైతే రూ.8 లక్షలు, ఆడపిల్ల రేటు రూ.4 లక్షలు! పసికందుల అమ్మకాల ముఠా అరెస్ట్
- ●Layoff Stories | సంతోషంగా ఊరికి పయనమైన యువకుడు.. దారి మధ్యలో లేఆఫ్ మెయిల్.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టోరీ!
- ●Pune Walk-in Interview | 8 నెలలు ఫ్రీగా పనిచేయాలి.. జీతం తర్వాత ఆలోచిస్తాం! ఇంటర్వ్యూలో హెచ్ఆర్ కండిషన్ విని యువకుడికి ఫ్యూజులవుట్

Indian Whisky Market | స్కాచ్‌కు 'దేశీ' బ్రాండ్స్ చెక్.. గ్లోబల్ మార్కెట్లోనూ ఇండియన్ విస్కీలదే హవా!

Rare Blood Disorder Pregnancy | అరుదైన వ్యాధి.. ముగ్గురు శిశువుల మృతి.. ఆపై మృత్యువును జయించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

Techie Salary 40 LPA | రూ.40 లక్షల ప్యాకేజీ వస్తున్నా నేను పేదవాడినే.. కనీసం ఇల్లు కూడా కొనలేకపోతున్నా: టెక్కీ ఆవేదన

Delhi Baby Trafficking | ఢిల్లీలో 'బేబీ బజార్'.. మగ పిల్లాడైతే రూ.8 లక్షలు, ఆడపిల్ల రేటు రూ.4 లక్షలు! పసికందుల అమ్మకాల ముఠా అరెస్ట్






