Save The Tigers 3 Review | సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ – జియో హాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సేవ్ ది టైగర్స్ 3 వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సోషియో ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే?
Entertainment | Published On Jun 19, 2026, 7.37 pm IST
Save The Tigers 3 Review | ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సేవ్ ది టైగర్స్ 3 వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో శుక్రవారం రిలీజైంది. ప్రదీప్ అద్వైతం, మహి వి రాఘవ్ క్రియేటర్స్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. జోర్దార్ సుజాత, దేవయాని, పావని కీలక పాత్రలు పోషించారు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్‌గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉంది? గత సీజన్లకు మించి నవ్వించిందా? లేదా? అంటే?
ముగ్గురు స్నేహితుల కష్టాలు...
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో డబ్బులో పోగోట్టుకుంటాడు గంటా రవి (ప్రియదర్శి). భార్య హైమా బలవంతం చేయడంతో బోరబండ బస్తీలోని ఇంటి నుంచి గేటెడ్ కమ్యూనిటీకి షిప్ట్ అవుతాడు. కమ్యూనిటీలో ఇమడలేక ఇబ్బందులు పడుతుంటాడు. విక్రమ్‌కు (చైతన్య కృష్ణ) మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని అనుమానించిన రేఖ (దేవయాని) అతడికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ కేసు కోర్టులో ఉంటుంది. జాబ్ పోవడంతో కష్టాలు పడుతుంటాడు. అత్తింట్లో గౌరవం కోసం జాబ్ చేస్తానని భార్య మాధురికి (పావని గంగిరెడ్డి) మాటిస్తాడు రాహుల్ (అభినవ్ గోమఠం). కానీ కొద్ది రోజులకే ఆ ఉద్యోగం పోతుంది. భార్య దగ్గర ఆ విషయం దాచిపెడతాడు. ఓ రోజు తాగిన మత్తులో ముగ్గురు ఇంద్రుడిని తిడతారు. దాంతో వారిని ఇంద్రుడు మరో లోకంలోకి పంపిస్తాడు. అక్కడ గంటా రవి ఎమ్మెల్యే అవుతాడు. అవినీతి పనులు చేసి కోట్లు సంపాదిస్తాడు. రాహుల్ ఫేమస్ సినిమా రైటర్‌గా మారతాడు. విక్రమ్ అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకుంటూ జల్సాలు చేస్తుంటాడు. భిక్షపతి అనే పోలీస్ ఆఫీసర్ కారణంగా ముగ్గురి జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి. గేటెట్ కమ్యూనిటీలో హైమాకు ఎలాంటి అవమానం ఎదురైంది? భర్త నుంచి విడాకులు తీసుకోవాలని అనుకున్న రేఖ తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది? ప్రెగ్నెన్సీ కాదనుకున్న మాధురిలో రాహుల్ ఎలా మార్పు తీసుకొచ్చాడు? మరో లోకంలో ఈ ముగ్గురు స్నేహితులు భార్యలపై ఎలా డామినేషన్ చేశారు అన్నదే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కథ.
మనిషిని పోలిన మనుషులు...
ప్రపంచంలో ఓ మనిషిని పోలిన మనుషులు మరో ఏడుగురు ఉంటారని, ఓ లోకంలో తీరని కోరికలు మరో లోకంలో తీరుతాయని పురాణాలు చెబుతుంటాయి. శాస్త్రీయంగా వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ నిజంగానే ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు ఒకరికొకరు తారసపడితే...ఓ లోకంలో నుంచి మరో లోకంలోకి అడుగుపెడితే ఎలాంటి కన్ఫ్యూజన్లు, గొందరగోళాలు నెలకొంటాయనే అంశాలతోనే సేవ్ ది టైగర్స్ 3 వెబ్‌సిరీస్ తెరకెక్కింది.
పెళ్లైనా మగాడి కష్టాలు, భార్యల కారణంగా భర్తలు పడే ప్రస్టేషన్లతో సేవ్ ది టైగర్స్ గత రెండు సీజన్లు రూపొందాయి. వాటికి భిన్నంగా సోషియో ఫాంటసీ కథతో మూడో సీజన్‌ను తెరకెక్కించారు.
బోల్డ్ డైలాగ్స్...
గంటా రవి, రాహుల్, విక్రమ్ ఓ ముగ్గురిని కిడ్నాప్ చేయడం, వారు అచ్చం వీళ్ల పోలికలతోనే కనిపించే సీన్‌తోనే సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత ముగ్గురి కష్టాలు చూపించారు. లోకాల స్వాపింగ్ అనే ఆప్షన్‌ను వాడుకొని మరో లోకంలోకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది ఫన్నీగానే చూపించారు. ఎమ్మెల్యే అయిన గంటా రవి ప్రజలకు మంచి చేసే పనులు టైమ్‌పాస్ చేస్తాయి. సినిమా రైటర్‌గా రాహుల్ డైలాగ్స్, అతడి సినిమా టైటిల్స్, షూటింగ్ లోకేషన్ సీన్లు కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. చైతన్య కృష్ణ ట్రాక్‌ను బోల్డ్‌గా చూపించారు. డైలాగ్స్ అలాగే ఉన్నాయి. చివరి రెండు ఎపిసోడ్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. అపోహలు, అపార్థాలు తొలగిపోయి మూడు జంటలు ఎలా ఏకమయ్యాయన్నది చూపించి ఎండ్ చేశారు.
ప్రియదర్శి డైలాగ్ డెలివరీ...
మూడు జంటలు డ్యూయల్ షేడ్ రోల్స్‌లో కనిపించారు. అవినీతి పరుడైన ఎమ్మెల్యేగా, బస్తీ యువకుడిగా ప్రియదర్శి నటన, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఉమెనైజర్‌గా చైతన్య కృష్ణ పాత్రను యూత్ ఆడియెన్స్‌ను మెప్పించేలా డిజైన్ చేశారు. స్టార్ రైటర్‌గా, అత్తింట్లో ఇబ్బందులు పడే అల్లుడిగా అభినవ్ కామెడీ టైమింగ్ బాగుంది. జోర్దార్ సుజాత, దేవయాని, పావని నటన బాగుంది. వెన్నెలకిషోర్ గెస్ట్ అప్పిరియెన్స్ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. గంగవ్వ, రాకింగ్ రాకేష్, రోహిణితో పాటు మిగిలిన వారు తమ పరిధుల మేర నవ్వించారు. ఆరు ఎపిసోడ్స్‌తో నవ్విస్తూనే థ్రిల్లింగ్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు శ్రీరామ్ ఏరగం. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.సేవ్ ది టైగర్స్ 3 మూడు గంటలు టైమ్‌పాస్ చేస్తుంది. మరీ ఎక్కువగా కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసపాయింట్ అవుతారు.
సంబంధిత వార్తలు

Folk Dancer | హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ – సుకుమార్ సినిమాలో ఛాన్స్
జూన్ 19, 2026

Telugu Web Series | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ వెబ్‌సిరీస్ – సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా టాలీవుడ్ హీరో
జూన్ 15, 2026

Kajal Aggarwal | లేడీ డాన్‌గా కాజల్ – సైలెంట్‌గా తెలుగు వెబ్‌సిరీస్‌కు ప్యాకప్
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!
- ●Sreeleela | సాయిపల్లవి, శ్రీలీల తమిళ మూవీ టైటిల్ ఇదే - అల్లు అర్జున్ పుష్ప తో లింక్?
- ●Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..
- ●Gandhi Sarovar | గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

Yuvraj Singh | ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుస్తాడా..? సపోర్టింగ్ స్టాఫ్‌లోకి యువరాజ్‌సింగ్..!

Sreeleela | సాయిపల్లవి, శ్రీలీల తమిళ మూవీ టైటిల్ ఇదే - అల్లు అర్జున్ పుష్ప తో లింక్?

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..



