Yogalakshmi | టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న టూరిస్ట్ ఫ్యామిలీ హీరోయిన్ – అచ్చ తెలంగాణ అమ్మాయిగా!
టూరిస్ట్ ఫ్యామిలీ బ్యూటీ యోగలక్ష్మి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అచ్చ తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జిల్లేడు చెట్టు పేరుతో ఎమోషనల్ డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈటీవీ విన్ ఓటీటీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో యోగలక్ష్మి కథానాయికగా నటిస్తోన్న మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
Entertainment | Published On Oct 21, 2026, 1.38 pm IST
Yogalakshmi | తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ చిన్న సినిమాగా రిలీజై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులను మెప్పించింది. కేవలం ఏడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ కోలీవుడ్ మూవీ 90 కోట్లకుపైగా కలెక్షన్లు దక్కించుకుంది. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో యోగలక్ష్మి ఓవర్‌నైట్‌లోనే కోలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో శింబు అరసన్‌తో పాటు హీరోయిన్‌గా మరో నాలుగు సినిమాలు చేస్తోంది.
ఓటీటీ మూవీతో...
ఓటీటీ మూవీతో యోగలక్ష్మి టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేయబోతుంది. ఈటీవీ విన్ ఓటీటీ నిర్మిస్తోన్న జిల్లేడుచెట్టు సినిమాలో కథానాయికగా నటిస్తోంది. దసరా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాల ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రావణ్ విక్టర్ ఐపూరి దర్శకత్వం వహిస్తున్నారు.
బతుకమ్మ వీడియో...
జిల్లేడు చెట్టు సినిమాలో యోగలక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు మేకర్స్ బుధవారం అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బతుకమ్మ ఆడుతూ ఈ తమిళ బ్యూటీ కనిపిస్తోంది. ఆమె అందానికి ఫిదా అయిన యువకుడిగా దీక్షిత్ శెట్టి కనిపించాడు. బ్యాక్‌డ్రాప్‌లో బతుకమ్మ పాట వినిపించడం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అచ్చ తెలంగాణ అమ్మాయిగా యోగలక్ష్మి కనిపించబోతున్నట్లు సమాచారం.
తెలంగాణ సంస్కృతి....
ఆధునికత కారణంగా మనుషుల మధ్య దూరం ఎలా పెరిగిందనే మెసేజ్‌తో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జిల్లేడు చెట్టు మూవీ తెరకెక్కుతోంది. తెలంగాణ సంస్కృతి, యాస, భాషలతో దర్శకుడు శ్రావణ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో జిల్లేడు చెట్టు మూవీ రిలీజ్ కాబోతుంది.
ప్రస్తుతం యోగలక్ష్మి తమిళంలో శింబు అరసన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పికాసో, మ్యాచ్‌ఫిక్సింగ్ సినిమాలు చేస్తోంది. హార్ట్‌బీట్, కోర్ట్ వెబ్‌సిరీస్‌లు ఈ తమిళ సుందరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
- ●Hyderabad Police | నాలుగు పాలపిట్టలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు
- ●US Visa | వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా.. ఏడాదిలోనే మూడు లక్షల వీసాలు రద్దు..!
- ●Jio IPO | జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్..
- ●K-Harmony Festa | హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 25న ‘కె-హార్మనీ ఫెస్టా’
- ●Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ

Hyderabad Police | నాలుగు పాలపిట్టలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

US Visa | వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా.. ఏడాదిలోనే మూడు లక్షల వీసాలు రద్దు..!

Jio IPO | జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్..





