Anil Ravipudi | అనసూయపై అనిల్ రావిపూడి సెటైర్లు – శివాజీ ఫోన్‌చేశాడంటూ కామెంట్స్
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో శివాజీ, అనసూయ మధ్య గొడవపై అనిల్ రావిపూడి సెటైర్లు వేశారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు తనను ఆహ్వానించిన శివాజీ...ఈ సారి జాగ్రత్తగా మాట్లాడుతానని అన్నారని పేర్కొన్నారు.
Entertainment | Published On Feb 7, 2026, 2.45 pm IST
Anil Ravipudi | శివాజీ, యాంకర్ అనసూయ గొడవపై డైరెక్టర్ అనిల్ రావిపూడి సెటైర్లు వేశారు. ఇటీవల శివాజీ, యాంకర్ అనసూయ మధ్య వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ కామెంట్లు చేశాడు. ఈ క్రమంలో కొన్ని బూతులు మాట్లాడటం వివాదానికి దారితీసింది. శివాజీ వ్యాఖ్యలపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ సలహాలు మాకు అక్కరలేదంటూ పేర్కొన్నది. చిన్నగా మొదలైన ఈ వివాదం కాస్త టాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు సినీ ప్రముఖులు అనసూయకు మద్దుతు ఇవ్వగా...నెటిజన్లు మాత్రం శివాజీకి సపోర్ట్ చేశారు. మహిళా కమీషన్ నోటీసులు ఇవ్వడంతో శివాజీ సైలెంట్ అయ్యారు. కానీ అనసూయ మాత్రం ఈ వివాదంపై చాలా రోజులు ట్వీట్‌లు, పోస్ట్‌లు పెడుతూనే వచ్చింది.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో...
తాజాగా అనసూయ, శివాజీ గొడవపై టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రియాక్ట్ అయ్యారు. శివాజీ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఓటీటీ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు తనను ఆహ్వానించడానికి శివాజీ ఫోన్ చేశారని చెప్పారు. ఈ సారి జాగ్రత్తగా మాట్లాడతానని శివాజీ తనతో అన్నాడని అనిల్ రావిపూడి చెప్పగానే ఈవెంట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
ఓటీటీలో రిలీజ్...
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను రిలీజ్‌కు ముందే చూడాలని అనుకున్నానని, కానీ మన శంకర వరప్రసాద్‌గారు పనుల్లో పడి కుదరలేదని అనిల్ రావిపూడి అన్నారు. ట్రైలర్ చూడగానే ఫిబ్రవరి 12న ఈ సినిమాను ఓటీటీలో తప్పకుండా చూడాలనే ఫీల్ కలిగింది అని పేర్కొన్నారు. శివాజీ, లయ, రోహన్ అందరి పాత్రలు డిఫరెంట్‌గా ఉన్నాయని, హీరోగానే కాకుండానే ప్రొడ్యూసర్‌గా శివాజీకి విజయం దక్కాలని అనిల్ రావిపూడి తెలిపారు. కుదిరితే ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసి థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్‌కు సూచించారు.
అనిల్ రావిపూడికి అడ్వాన్స్ ఇచ్చిన అలీ...
ఈ వేడుకలో అనిల్ రావిపూడిని హీరో కావాలంటూ కమెడియన్ ఆలీ ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారు. అమెరికన్ డాలర్స్ ఇవ్వడం ఆసక్తిని పంచింది. ఆలీ నుంచి అడ్వాన్స్ తీసుకున్న అనిల్ రావిపూడి...హీరోగా కాకుండా డైరెక్టర్‌గా ఆలీకి సినిమా చేసి పెడతానని అన్నారు. తాను ఎప్పటికీ హీరోను కానని చెప్పారు. ఆయన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్ పాత్రలో విద్యాబలన్..! ఇది మన తెలుగు సినిమానే..!
మే 13, 2026

Aanasuya | శివాజీ సృష్టించిన చీర కట్టుకొని తిరుగుతున్నా – అనసూయ సెటైరికల్ పోస్ట్ వైరల్
ఏప్రిల్ 11, 2026

Crime Comedy OTT | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ – దృశ్యం సినిమాకు మించిన ట్విస్ట్‌లతో…
మార్చి 30, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



