త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aanasuya | జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో పోస్ట్ చేసిన అన‌సూయ – కామెడీ పీస్ అంటూ నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు

జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తోన్న ఓ వీడియోను యాంక‌ర్ అన‌సూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో స్పీడ్‌గా ఎక్స‌ర్‌సైజులు చేస్తూ అన‌సూయ క‌నిపించింది. ఈ వీడియోలో అన‌సూయ పొట్టి డ్రెస్‌లో క‌నిపించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. శివాజీ చెప్పింది ఇంకా మీ త‌ల‌కు ఎక్కిన‌ట్లు లేదంటూ నెటిజ‌న్లు అన‌సూయ వీడియోను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.

N

Entertainment | Published On Aug 31, 2026, 7.18 pm IST

Aanasuya | జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో పోస్ట్ చేసిన అన‌సూయ – కామెడీ పీస్ అంటూ నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు
Advertisement

Aanasuya |  జై శ్రీరామ్ నినాదంపై ఇటీవ‌ల యాంక‌ర్ అన‌సూయ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసిందంటూ ఆమెపై ఓ పొలిటిక‌ల్ పార్టీ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై త‌న‌ను తాను స‌మ‌ర్థించుకుంటూ అన‌సూయ వారికి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. భ‌క్తి ముసుగులో మ‌హిళ‌ల‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించే వారినే తాను ప్ర‌శ్నించాన‌ని, కొంద‌రు త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ వివాదం మ‌రువ‌క ముందే మ‌రోసారి అన‌సూయ పేరు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సారి కాంట్ర‌వ‌ర్సీల‌తో కాదు. ఓ వీడియోతో వార్త‌ల్లో నిలిచింది.

అన‌సూయ‌...

జిమ్‌లో వ‌ర్క‌వుట్‌తో పాటు డ్యాన్స్‌లు చేసిన ఓ వీడియోను అన‌సూయ సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చాలా స్పీడ్‌గా ఎక్స‌ర్‌సైజులు చేస్తూ ఈ యాంక‌ర్‌ క‌నిపించింది. పాప్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. డ్యాన్స్‌, వ‌ర్క‌వుట్స్ ఒకేసారి క‌ల‌గ‌ల‌పి చేస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఆగ‌స్ట్ స్ట్రాంగ్‌గా మార్చింది...

ఆగ‌స్ట్ నువ్వు న‌న్ను మ‌రింత స్ట్రాంగ్‌గా మార్చావు. చురుకుగా క‌దులుతూ, డ్యాన్స్ చేస్తూ , సంతోషంగా న‌వ్వుతూ, చెమ‌ట‌లు చిందిస్తూ... ఈ నెల మొత్తం నేను నాలా గ‌డిపాను. అదే ఉత్సాహంతో నీకు సెండాఫ్ ఇస్తా అంటూ ఈ వీడియోకు క్యాప్ష‌న్ జోడించింది.

శివాజీ చెప్పింది త‌ల‌కు ఎక్క‌లేదా...

అన‌సూయ పోస్ట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో అన‌సూయ పొట్టి డ్రెస్‌లో క‌నిపించ‌డంపై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. కామెడీ పీస్ అంటూ విమ‌ర్శిస్తున్నారు. శివాజీ చెప్పింది ఇంకా మీ త‌ల‌కు ఎక్క‌లేదా ఏంటి అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. డ‌బ్బులు వ‌స్తున్నాయి క‌దా అని ఏ వీడియో ప‌డితే ఆ వీడియో పోస్ట్ చేయ‌ద్దు...డ‌బ్బులు కాదు వ్య‌క్తిత్వం ముఖ్య‌మ‌ని మ‌రో నెటిజ‌న్ అన‌సూయ వీడియోను ఉద్దేశించి కామెంట్ పెట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement
Advertisement