Allu Sirish | ట్రెడిషన్‌ను ఫాలో అయిన శిరీష్ – మొదటి శుభలేఖ మావయ్యకే….
అల్లు శిరీష్ పెళ్లి పనులు మొదలయ్యాయి. తన పెళ్లి మొదటి శుభలేఖ మావయ్య మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చాడు శిరీష్. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నయనిక రెడ్డితో శిరీష్ పెళ్లి మార్చి 6న జరుగనుంది.
Entertainment | Published On Feb 15, 2026, 5.41 pm IST
Allu Sirish | అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6 వతేదీన జరుగనుంది. ఇటీవలే పసుపు దంచుడు కార్యక్రమంలో పెళ్లి పనులు మొదలుపెట్టారు. తాజాగా శుభలేఖలు పంచడం ప్రారంభించారు.
మెగాస్టార్‌కు...
తన పెళ్లికి సంబందించి మొదటి శుభలేఖను మావయ్య మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు శిరీష్. తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ ఇంటికి స్వయంగా వెళ్లిన శిరీష్ పెళ్లి కార్డును చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలకు ఇచ్చారు. ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇంటి పెద్దలకే మొదటి శుభలేఖను అందించాలనే సంప్రదాయం చాలా కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీలలో కొనసాగుతుందట. ఈ ట్రెడిషన్‌ను ఫాలో అయిన శిరీష్ మెగాస్టార్‌కు తొలి కార్డు అందించినట్లు చెబుతోన్నారు.
మార్చి 6న పెళ్లి...
ప్రియురాలు నయనిక రెడ్డితో అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6న జరుగనుంది. హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా వీరి వివాహం జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లికి మెగా హీరోలతో పాటు టాలీవుడ్ స్టార్స్ మొత్తం అటెండ్ కానున్నట్లు చెబుతున్నారు. బ్యాచ్‌లర్ పార్టీని జనవరి నెలాఖరున దుబాయ్‌లో గ్రాండ్‌గా జరుపుకున్నారు శిరీష్, నయనిక. వీరి ఎంగేజ్మేంట్ గత ఏడాది అక్టోబర్ లో జరిగింది.
గత రెండేళ్లుగా నయనికతో ప్రేమలో ఉన్నారు శిరీష్.పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హీరో నితిన్ భార్య షాలిని కారణంగానే శిరీష్, నయనిక మధ్య పరిచయం ఏర్పడిందట. నయనిక రెడ్డి తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



