త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | భార్య స్నేహారెడ్డి బ‌ర్త్‌డే – రొమాంటిక్‌గా విషెస్ చెప్పిన బ‌న్నీ

భార్య స్నేహారెడ్డి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. హ్యాపీ బ‌ర్త్‌డే క్యూటీ అంటూ రొమాంటిక్ విషెస్ చెప్పాడు. స్నేహారెడ్డి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాకా షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన బ‌న్నీ ప్ర‌స్తుతం పారిస్ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

N

Entertainment | Published On Sep 29, 2026, 7.24 pm IST

Allu Arjun | భార్య స్నేహారెడ్డి బ‌ర్త్‌డే – రొమాంటిక్‌గా విషెస్ చెప్పిన బ‌న్నీ
Advertisement

Allu Arjun | భార్య స్నేహారెడ్డి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమెకు స్పెష‌ల్‌గా విషెస్ చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఓ రొమాంటిక్ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం రాకా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భార్య స్నేహారెడ్డి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాకా షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చాడు. భార్య‌తో క‌లిసి పారిస్‌కు వెకేష‌న్‌కు వెళ్లాడు. ఈ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోన్నాడు.

బ‌ర్త్‌డే విషెస్‌...

మంగ‌ళ‌వారం స్నేహారెడ్డి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హ్యాపీ బ‌ర్త్‌డే క్యూటీ అంటూ భార్య‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడు. ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇందులో అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి ఇద్ద‌రూ వైట్ అండ్ వైట్ డ్రెస్‌గా క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో తీర ప్రాంతం, సూర్యాస్త‌మ‌యం క‌నిపిస్తున్నాయి. ఈ రొమాంటిక్ ఫొటో వైర‌ల్ అవుతోంది.

ఫిట్‌నెస్ ప్రియురాలిగా...

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ భార్యగానే తెలుసు. కానీ వ్యాపారవేత్తగా స్నేహారెడ్డి రాణిస్తున్నారు. అంతే కాకుండా ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, డిజిటల్ పర్సనాలిటీగా స్నేహా రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు 91 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

స్టూడియో...

స్నేహా రెడ్డి పికాబూ (Picaboo) పేరుతో ఓ స్టూడియోను నెల‌కొల్పారు. 2016లో ప్రారంభ‌మైన ప్రొఫెష‌న‌ల్ ఆన్‌లైన్ స్టూడియో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. మరోవైపు ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు తరచూ తన వర్కౌట్స్, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

కుటుంబానికి టైమ్‌...

కుటుంబానికి కూడా స్నేహా రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భ‌ర్త‌, త‌న‌ పిల్లలతో కలిసి గడిపే అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఆమె షేర్ చేసే ట్రావెల్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ పోస్టులు చాలా సార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

 

Advertisement
Advertisement