Bhatti Vikramarka | దళితుల ఆత్మగౌరవం కోసం ఐక్య పోరాటం : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | రాజ్యాంగంపై నమ్మకం లేని కారణంగానే దళితులు, ఆదివాసీలపై వివక్ష కొనసాగుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని దళితుల ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. దళిత, ఆదివాసీల ఆత్మగౌరవ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka | రాజ్యాంగంపై నమ్మకం లేని కారణంగానే దళితులు, ఆదివాసీలపై వివక్ష కొనసాగుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని దళితుల ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. దళిత, ఆదివాసీల ఆత్మగౌరవ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, అస్పృశ్యత నిర్మూలన వంటి విలువలకు రాజ్యాంగమే ఆధారమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బీజేపీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని భట్టి విమర్శించారు. రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతి, మను ధర్మశాస్త్ర భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రతి పౌరుడిని ఒక్కటిగా నిలబెట్టేది రాజ్యాంగమేనని, దాన్ని ఉల్లంఘించడం దేశ పునాదులను దెబ్బతీయడమేనని అన్నారు.
ఖర్గేకు అవమానంపై ఆగ్రహం
మల్లికార్జున ఖర్గే సుదీర్ఘ రాజకీయ పోరాటంతో ఉన్నత పదవులు చేపట్టిన నాయకుడని భట్టి గుర్తుచేశారు. అలాంటి నాయకుడి సభ అనంతరం హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడం దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన తీవ్రమైన అంశమన్నారు. ఖర్గేకు జరిగిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ నిరసన చేపడితే, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఆయనపైనే కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయం కోసం ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం వ్యవస్థలోని వివక్షను బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.
రెండో తరగతి పౌరులుగా చూడొద్దు..
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కోట్లాది మంది ప్రజలకు సమాన హక్కులు, గౌరవంతో జీవించేలా రాజ్యాంగ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను రెండో తరగతి పౌరులుగా చూసే పరిస్థితిని అంగీకరించబోమన్నారు. ‘ప్రతి రాష్ట్రానికి వెళ్దాం.. ప్రజలను చైతన్యపరుద్దాం.. ఆత్మగౌరవం కోసం పోరాడుదాం. ఎలాంటి అవమానాన్ని సహించబోం’ అని భట్టి స్పష్టం చేశారు. సామాజిక న్యాయ చట్టాలను కాపాడుకోవడంతోపాటు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ జెండా కింద ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
సెప్టెంబర్ 29, 2026

TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు
సెప్టెంబర్ 29, 2026

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
- ●Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ
- ●TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు
- ●Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
- ●Yashmi Gowda | రొమాంటిక్ సీరియల్తో తెలుగులోకి బిగ్బాస్ బ్యూటీ రీఎంట్రీ
- ●RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు

Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ

TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్



