Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ – బర్త్‌డే పోస్ట్ వివాదం
టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెబుతూ ప్రగ్యా జైస్వాల్ పెట్టిన ఓ పోస్ట్ వివాదానికి దారితీసింది. ప్రగ్యా జైస్వాల్‌ను అక్కినేని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే?
Entertainment | Published On Aug 29, 2026, 4.27 pm IST
Pragya Jaiswal | నాగార్జున బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పెట్టిన ఓ పోస్ట్ వివాదానికి దారితీసింది. ఈ బోల్డ్ బ్యూటీని అక్కినేని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున బర్త్‌డే సందర్భంగా శనివారం ఆయనకు పలువురు సెలిబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలుచెప్పారు. ప్రగ్యా జైస్వాల్ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నాగార్జున స్టైలిష్ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు ర్యాప్ మ్యూజిక్‌ను జోడించింది. అదే ప్రగ్యా జైస్వాల్‌ను చిక్కుల్లో పడేసింది.
అక్కినేని నాగేశ్వరరావు వాయిస్...
అక్కినేని నాగేశ్వరరావు వాయిస్‌ను ఇమిటేట్ చేస్తూ సాగిన ఈ పాటలో దారుణమైన బూతులు ఉన్నాయి. అది గమనించకుండా ప్రగ్యా జైస్వాల్ తన పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఈ పాటను యాడ్ చేసింది. ఈ పోస్ట్‌పై విమర్శలు రావడంతో తన తప్పును గ్రహించిన ప్రగ్యా జైస్వాల్ ఆ మ్యూజిక్‌ను తొలగించింది. పోస్ట్‌ను మాత్రం అలాగే ఉంచింది.
అక్కినేని ఫ్యాన్స్ ఫైర్...
తెలుగు భాష తెలియకుండా పోస్ట్‌లు పెడితే ఇలాంటి తప్పిదాలే జరుగాయని నెటిజన్లు అంటున్నారు. పదేళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తున్నా భాషపై కనీస అవగాహన లేకపోవడం దారుణమని కామెంట్లు పెడుతున్నారు. ఏది బూతుపదమో...ఏది మంచి మాట అన్నది కూడా తెలియకుండా పోస్ట్‌లు పెట్టద్దొని ట్రోల్ చేస్తున్నారు. టాప్ హీరోను దారుణంగా అవమానించిన ప్రగ్యా జైస్వాల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మెగా హీరోతో కంచె...
2015లో వచ్చిన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాలో బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా నటించాడు. మెగా హీరో వరుణ్‌తేజ్‌కు జోడీగా నటించిన కంచెతో తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీత పాత్రలో ప్రగ్యా తన నటనతో ఆడియెన్స్‌ను మెప్పించింది. బాలకృష్ణతో అఖండ, డాకు మహారాజ్ సినిమాలు చేసింది. ప్రస్తుతం టైసన్ నాయుడులో ఓ కీలక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.
Evadraa ee acc manage cheseydhi
Meeku moodindhi
Pragya jaiswal insta story🫣🫣🫣 pic.twitter.com/Lz9Q4Dug6P— DHFM™ (@183_off_145_) August 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్రమ్
సెప్టెంబర్ 12, 2026

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే – ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెప్టెంబర్ 12, 2026

Rashmika Mandanna | ఎంఎస్‌సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్ – బయోపిక్ లాంఛ్ ఎప్పుడంటే?
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే
- ●Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయతలతోనే అవార్డులు ఇస్తున్నాం
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే



