Postpone | టాలీవుడ్లో వాయిదాల పర్వం.. రామ్‌చరణ్ దెబ్బకు మరో తేదీ వెతుక్కుంటున్న అఖిల్!
Postpone | టాలీవుడ్లో (Tollywood) వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే రామ్‌చరణ్ (Ramcharan) మూవీ `పెద్ది`.. విడుదల పోస్ట్‌పోన్ (Postpone) అయిన విషయం తెలిసిందే. అదేబాటలో అడవిశేష్ `డెకాయిట్` సైతం వాయిదాపడింది. తాజాగా అక్కినేని హీరో అఖిల్ (Akkineni Akhil) మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `లెనిన్` (Lenin) కూడా మరో తేదీని వెతుక్కునే పనిలో పడింది..!
Postpone | త్రినేత్ర.న్యూస్: టాలీవుడ్లో (Tollywood) వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే రామ్‌చరణ్ (Ramcharan) ప్రెస్టీజియస్ మూవీ `పెద్ది`.. విడుదల పోస్ట్‌పోన్ (Postpone) అయిన విషయం తెలిసిందే. అదేబాటలో అడవిశేష్ `డెకాయిట్` సైతం వాయిదాపడింది. తాజాగా అక్కినేని హీరో అఖిల్ (Akkineni Akhil) మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `లెనిన్` (Lenin) కూడా మరో తేదీని వెతుక్కునే పనిలో పడింది..!
మార్చి నెలలో భారీ సినిమాలు విడుదల కానున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌ను మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అదే నెలలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar 2), కన్నడ హీరో యష్ నటించిన 'టాక్సిక్` విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్లో విడుదలై వెయ్యికోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ధురంధర్ తొలి పార్ట్.. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తున్నది. ఈ మూవీ సెకండ్ పార్ట్‌పై భారీ క్రేజ్ నెలకొంది. ఇక కేజీఎఫ్ తర్వాత యష్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న టాక్సిక్ మూవీపై అంచనాలున్నాయి.
ఓవైపు బాబాయ్ సినిమా, మరోవైపు రణ్వీర్ సింగ్, యష్ పోటీకి వస్తుండటంతో రామ్‌చరణ్ నటించిన `పెద్ది` వాయిదా పడింది. తొలుత ఈ మూవీని మార్చి 27న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే భారీ ప్రాజెక్టులు విడుదల సిద్ధమవడంతో `పెద్ది` టీమ్ ఏప్రిల్ అయితే బెటర్‌గా ఉంటుందని భావించినట్లుంది. దీంతో ఏప్రిల్ 30కి విడుదల తేదీని మార్చుకున్నది.
ఈ ప్రభావం అక్కినెని అఖిల్ నటించిన లెనిన్పై పడింది. అసలే ఒక్క హిట్టుకూడా లేక కొట్టుమిట్టాడుతున్న అఖిల్‌కు మే 1న సోలోగా థియేటర్లలోకి రావాలనుకున్నాడు. అయితే `పెద్ది` రూపంలో అఖిల్‌కు రామ్‌చరన్ చెక్‌పెట్టాడు. అక్కినేని కుటుంబానికి మే నెల సెంటిమెంట్‌గా ఉండటంతో మే 1ని లాక్చేశారు. అయితే ఇప్పుడు అంతకు ఒక్కరోజు ముందే అంటే ఏప్రిల్ 30న రామ్‌చరణ్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో `లెనిన్` మరో తేదీని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పెద్దిపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అఖిల్ ఏంచేస్తాడో చూద్దాం..!
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | చెల్లిని రిజెక్ట్ చేసి అక్కకు ఛాన్స్ – పెద్ది హీరోయిన్ సెలెక్షన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా!
మే 16, 2026

Ram Charan | పెద్ది ప్రమోషన్స్‌లో చేతికి బ్యాండేజ్‌తో రామ్ చరణ్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
మే 15, 2026

Peddi | ఐపీఎల్ మ్యాచ్‌లో రామ్‌చరణ్ పెద్ది ప్రమోషన్స్ – పాన్ ఇండియన్ లెవెల్లో ఈవెంట్స్…
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



