Akira Nandan | మరాఠీ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ – తెలుగులో రిలీజ్
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ చైల్డ్ యాక్టర్‌గా ఓ సినిమా చేశాడు. తల్లి రేణు దేశాయ్ దర్శకత్వంలో రూపొందిన మరాఠీ మూవీ ఇష్క్ వాలా లవ్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఈ మూవీ తెలుగులో అదే పేరుతో రిలీజైంది.
Entertainment | Published On Jan 25, 2026, 6.31 pm IST
Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్‌లో చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీలో తండ్రితో కలిసి అకీరా నటించినట్లు ప్రచారం జరిగింది. మేకర్స్ మాత్రం ఇవన్నీ రూమర్స్ అంటూ తేల్చేశారు. అయితే ఈ సినిమాకు టెక్నీషియన్‌గా వర్క్ చేశాడు అకీరా నందన్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టీమ్ మెంబర్స్‌లో ఒకరిగా బీజీఎమ్ అందించడంలో సాయం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తమన్ వెల్లడించాడు.
హీరో ఎంట్రీ...
అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. అకీరా ఫస్ట్ మూవీకి పలువురు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తోన్నాయి. అకీరా నందన్‌కు కెమెరాను ఫేస్ చేసిన అనుభవం ఇది వరకే ఉంది. చైల్డ్ యాక్టర్‌గా ఓ సినిమా చేశాడు. అయితే తెలుగులో కాదు. మరాఠీ మూవీతో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రేణు దేశాయ్ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తూ మరాఠీలో ఇష్క్ వాలా లవ్ పేరుతో ఓ సినిమా చేసింది.
ఆదినాథ్ కొఠారే, సులగ్నా పాణిగ్రహి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీని రేణుదేశాయ్ స్వయంగా నిర్మించారు.
రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మరాఠీ మూవీలో అతిథి పాత్రలో అకీరా నందన్ నటించాడు. హీరోహీరోయిన్లను కలిపే కీలక పాత్రలో మెరిశారు.
తెలుగులో రిలీజ్...
ఈ మరాఠీ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని రేణు దేశాయ్ భావించారు. ఇష్క్ వాలా లవ్ తెలుగు ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌ను రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ భారీగానే చేసినా అనివార్య కారణాల వల్ల థియేటర్లలో ఈ సినిమా విడుదల కాలేదు. ఇష్క్ వాలా లవ్ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు.ఇష్క్ వాలా లవ్ మాత్రం కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేదు. ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. ఈ సినిమా హిట్టు కాలేకపోయినా అకీరా నందన్ డెబ్యూ మూవీగా ఇష్క్ వాలా లవ్ నిలిచింది.
&https://x.com/kalyan__cult/status/2015285268333683001;
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



