Akhanda OTT | సేమ్ సీన్ రిపీట్ – ఓటీటీలోనూ అఖండ 2 పోస్ట్‌పోన్ – కారణమేమిటంటే?
బాలకృష్ణ అఖండ 2 మూవీ ఓటీటీలో పోస్ట్‌పోన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ వాయిదా వేయనున్నట్లు చెబుతోన్నారు. అఖండ 2 పోస్టర్‌ను అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Jan 6, 2026, 8.40 pm IST
Akhanda OTT | బాలకృష్ణ అఖండ 2 మూవీ థియేటర్లలో రిలీజ్ ముంగిట వాయిదాపడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫైనాన్షియల్ ఈష్యూస్ కారణంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సేమ్ సీన్ ఓటీటీలో రిపీట్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా పోస్ట్‌పోన్ కానున్నట్లు చెబుతున్నారు. అఖండ 2 మూవీ ఓటీటీ రైట్స్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 9 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇటీవల ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్ తాలూకు పోస్టర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించింది. తాజాగా ఈ పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్ తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అఖండ 2 జనవరి 9న ఓటీటీలో రిలీజ్ కావడం అనుమానమేనని చెబుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నెట్‌ఫ్లిక్స్ పోస్ట్‌పోన్ చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి. అందుకే పోస్టర్‌ను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తీసేందని అంటున్నారు.
సంక్రాంతి సినిమాల కారణంగా...
పోస్ట్‌పోన్‌కు కారణాలేమిటన్నది ఆసక్తికరంగా మారింది.జనవరి 9న ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు దళపతి విజయ్ జననాయగన్ రిలీజ్ కాబోతున్నాయి. వాటితో పాటు సంక్రాంతికి మరో ఐదు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సంక్రాంతి సినిమాలకు పోటీగా రిలీజ్ చేయడం వల్ల వ్యూయర్‌షిప్ తక్కువగా ఉంటుందనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నష్టాల కారణంగా...
మరోవైపు అఖండ 2 బయ్యర్లకు భారీగానే నష్టాలను మిగిల్చింది. ఈ నష్టాలపై ఇటీవలే దర్శకుడితో నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లు కలిసినట్లు సమాచారం. నష్టాల భర్తీకి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కోర్టును అప్రోచ్ కావాలని అనుకుంటున్నారట. లీగల్ ఇష్యూస్ వల్లే ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతోన్నారు.
అఖండ 2 మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాలుగో మూవీ ఇది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో వంద కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



