త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lokesh Kanagaraj | డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నివాసంపై రైడ్ – ప‌ది ఏకే 47 గ‌న్స్ స్వాధీనం

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నివాసంపై నిఘా బృందాలు జ‌రిపిన దాడుల్లో ప‌ది ఏకే 47 గ‌న్స్ దొర‌క‌డం క‌ల‌క‌లాన్ని రేపింది. పోలీసుల విచార‌ణ‌లో అవి నిజ‌మైన‌వి కావ‌ని, డ‌మ్మీ గ‌న్స్‌గా తేలాయ‌ట‌. ఈ సంఘ‌ట‌న త‌మిళ సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Mar 23, 2026, 6.02 pm IST

Lokesh Kanagaraj | డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నివాసంపై రైడ్ – ప‌ది ఏకే 47 గ‌న్స్ స్వాధీనం
Advertisement

Lokesh Kanagaraj | కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నివాసంపై ఎన్నిక‌ల నిఘా బృందాలు రైడ్ నిర్వ‌హించాయి. ఈ సోదాల్లో ప‌ది ఏకే 47లు ల‌భ్యం కావ‌డం త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎల‌క్ష‌న్ ఫ్ల‌యింగ్ స్క్వాడ్ టీమ్ త‌మిళ‌నాడులోని అశోక్ న‌గ‌ర్ తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో సోమ‌వారం సోదాలు చేప‌ట్టాయి.

10 ఏకే 47 గ‌న్స్‌...

ఈ దాడుల్లో నిఘా బృందాల‌కు ప‌ది ఏకే 47 గ‌న్స్ లభ్యం అయ్యాయ‌ట‌. అదీ కూడా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇంట్లో ఈ గ‌న్స్‌ దొరికాయ‌ట‌. ఆ గ‌న్స్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు చెందిన‌విగా తేల‌డ‌టంతో త‌మిళ సినీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లాన్ని రేపింది. ఈ ఏకే 47 గ‌న్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివ‌ర‌కు అవి నిజ‌మైన తుపాల‌కు కావ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింద‌ట‌. నిజ‌మైన వాటిని పోలీన‌ట్లుగా త‌యారు చేయించిన డ‌మ్మీగ‌న్స్ అట‌. సినిమా షూటింగ్ కోస‌మే వాటిని లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌త్యేకంగా సిద్ధం చేయించార‌ట‌. అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను పోలీసుల‌కు లోకేష్ క‌న‌గ‌రాజ్ టీమ్ స‌మ‌ర్పించార‌ట‌. దాంతో ఆ గ‌న్స్‌ను తిరిగి లోకేష్ క‌న‌గ‌రాజ్ బృందానికి పోలీసులు అప్ప‌గించార‌ట‌.

నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్‌తో...

ర‌జ‌నీకాంత్ కూలీ త‌ర్వాత త‌న నెక్స్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో చేయ‌బోతున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఇటీవ‌లే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. జూలై లేదా ఆగ‌స్ట్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు స‌మాచారం.

బ‌న్నీ బ‌ర్త్ డే...

అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ఏప్రిల్ 8న ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ వీడియో షూట్ కోస‌మే ఏకే 47 డ‌మ్మీ గ‌న్స్‌ను లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌యారు చేయించిన‌ట్లు వార్త‌లు వినిపిప‌స్తున్నాయి. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఏడో సినిమా ఇది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

హీరోగా ఎంట్రీ...

ఈ ఏడాదే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. డీసీ పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ త‌మిళ మూవీలో వామికా గ‌బ్బి హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వేస‌విలోనే రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement