త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్

OTT | ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ తీయ‌వ‌ర్ కులై న‌డుంగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 12 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Dec 10, 2025, 3.53 pm IST

OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్

అర్జున్‌, ఐశ్వ‌ర్య రాజేష్

Advertisement

OTT | సీనియ‌ర్ హీరో అర్జున్‌, ఐశ్వ‌ర్య రాజేష్ (Aishwarya Rajesh)  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ తీయ‌వ‌ర్ కులై న‌డుంగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఓటీటీ (Ott) రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. డిసెంబ‌ర్ 12 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
తీయ‌వ‌ర్ కులై న‌డుంగా సినిమాకు దినేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌వంబ‌ర్ 21న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. అర్జున్‌, ఐశ్వ‌ర్య రాజేష్ యాక్టింగ్ బాగుంద‌నే టాక్ వ‌చ్చినా కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావ‌డంతో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తెలుగులో మ‌ఫ్టీ పోలీస్ పేరుతో ఈ సినిమాను డ‌బ్ చేశారు. ఇక్క‌డ కూడా సేమ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది.
తీయ‌వ‌ర్ కులై న‌డుంగా మూవీలో అర్జున్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌గా...ర‌చ‌యిత కూతురి పాత్ర‌లో ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించింది.
జేబ‌నేస‌న్ అనే ర‌చ‌యిత దారుణ హ‌త్య‌కు గుర‌వుతాడు. బ్లాక్ సూట్‌, హెల్మెట్ ధ‌రించిన ఓ వ్య‌క్తి అత‌డిని న‌డి రోడ్డులో హ‌త్య‌ చేస్తాడు. ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేట్ చేసే బాధ్య‌త‌ను మ‌గుడ‌ప‌తి (అర్జున్‌) అనే పోలీస్ ఆఫీస‌ర్ తీసుకుంటాడు. జేబ‌నేస‌న్ కూతురి( ఐశ్వ‌ర్య రాజేష్‌)నే మ‌గుడ‌ప‌తి హంత‌కురాలిగా అనుమానిస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? అస‌లైన హంత‌కుల‌ను ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకోగ‌లిగాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.
తీయ‌వ‌ర్ కులై న‌డుంగా డిజాస్ట‌ర్‌తో సంబంధం లేకుండా ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఐశ్వ‌ర్య రాజేష్ ఫుల్ బిజీగా ఉంది. సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెలుగులో ఐశ్వ‌ర్య రాజేష్‌కు ఆఫ‌ర్లు పెరిగాయి. ప్ర‌స్తుతం పాక‌శాల పంతం, ఓ సుకుమారితో పాటు మూడు లాంత‌ర్లు అనే వెబ్‌సిరీస్ చేస్తోంది. త‌మిళంలో ఓ మూడు సినిమాల్లో న‌టిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement