త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్‌ పాత్రలో విద్యాబలన్‌..! ఇది మన తెలుగు సినిమానే..!

Vidya Balan | ఈ ఏడాది టాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హిందీలో రీమేక్‌ అవుతోంది. ప్రముఖ దర్శకుడు అనీస్‌ బజ్మీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

P

Entertainment | Published On May 13, 2026, 6.05 pm IST

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్‌ పాత్రలో విద్యాబలన్‌..! ఇది మన తెలుగు సినిమానే..!
Advertisement

Vidya Balan | ఈ ఏడాది టాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హిందీలో రీమేక్‌ అవుతోంది. ప్రముఖ దర్శకుడు అనీస్‌ బజ్మీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను నిర్మించిన దిల్‌రాజే హిందీ రీమేక్‌ను కూడా నిర్మించడం విశేషం. తెలుగు చిత్రంలో వెంకటేష్‌ పోషించిన మాజీ పోలీస్‌ అధికారి పాత్రను హిందీలో అక్షయ్‌ కుమార్‌ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ చేసిన భార్య పాత్రలో విద్యాబాలన్‌ కనిపించనుండగా.. మీనాక్షి చౌదరి చేసిన మాజీ ప్రేయసి పాత్రను రాశి ఖన్నా పోషిస్తోంది.

ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు..

ఇప్పటికే ‘భూల్‌ భులయ్యా’, ‘హే బేబీ’, ‘మిషన్‌ మంగళ్‌’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌ జోడీ మరోసారి తెరపై కనిపించనుండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్‌ను ప్రకటించకపోయినా.. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా సాగుతుండగా, ఇటీవల కేరళలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే అక్షయ్‌ కుమార్‌కు సంబంధించిన కొత్త లుక్‌, ప్రత్యేక స్టిల్‌ను విడుదల చేసే అవకాశముందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌రాజ్‌, సుదేశ్‌ లహిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శిరీష్‌ రెడ్డి, కుల్దీప్‌ రాథోర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌లో అనీస్‌ బజ్మీ-అక్షయ్‌ కుమార్‌ కాంబినేషన్‌కు మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉండడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ బజ్‌ నెలకొంది. ముఖ్యంగా కామెడీ, కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన కథ కావడంతో ఈ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే ప్రధాన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రోసారి బాల‌కృష్ట‌తో..

ఇదిలా ఉండగా, విద్యాబాలన్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కూడా ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎన్‌బీకే112’ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. గతంలో ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. మళ్లీ ఏడేళ్ల తర్వాత బాలకృష్ణ-విద్యాబాలన్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కావొచ్చన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉండనుందని, అందులో విద్యా బాలన్‌ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement
Advertisement