Bandhavi Sridhar | మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత ఛాన్స్.. ఇక బాంధవి సినిమాల్లో బిజీ అయ్యేనా..?
Bandhavi Sridhar | హైదరాబాదీ బ్యూటీ బాంధవి శ్రీధర్ ఎట్టకేలకు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న సైరాబాను మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. 2022లో విడుదలైన ‘మసూద’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బాంధవి శ్రీధర్, ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లలో కనిపించలేదు.
Entertainment | Published On Apr 4, 2026, 7.00 pm IST
Bandhavi Sridhar | హైదరాబాదీ బ్యూటీ బాంధవి శ్రీధర్ ఎట్టకేలకు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న సైరాబాను మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. 2022లో విడుదలైన ‘మసూద’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బాంధవి శ్రీధర్, ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లలో కనిపించలేదు. దాదాపు మూడేళ్లకు పైగా విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రానుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగు బ్యూటీ చిన్నప్పటి నుంచే నటనపై పెంచుకుంది. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మిస్టర్ పర్‌ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. ఆ తర్వాత మోడలింగ్‌లోకి వెళ్లింది. 2019లో అందాల పోటీల్లోనూ రాణించింది. మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ తదితర టైటిల్స్‌ను సాధించింది. 2022లో ‘మసూద’తో మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హారర్ లో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో కనిపించి.. తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో కూడా బాంధవి యాక్టివ్‌గా ఉంటూ ఫొటో షూట్లతో అభిమానులకు దగ్గరైంది.
తాజాగా యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న మూవీలో హీరోయిన్‌గా నటించనున్నది. ఈ మూవీ ఇటీవల అధికారికంగా ప్రారంభమైంది. ఫణి కృష్ణ సిరికి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సైరాభాను అనే టైటిల్‌ని ఖరారు చేశారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ప్రేమ, విశ్వాసం, విధికి సంబంధించిన ఒక సరదా ప్రయాణం’ అనే ట్యాగ్‌లైన్‌తో రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది. ఓ హిందూ-ముస్లిం ప్రేమకథ అని తెలుస్తుండగా.. వినోదభరితంగా సాగుతుందని తెలుస్తోంది. రాజమండ్రి, హైదరాబాద్ నగరాల నేపథ్యంలో కథ నడుస్తుందని టాక్. శంబాలతో మూవీతో ఇటీవల హిట్‌ని సొంతం చేసుకున్న ఆది సాయి కుమార్ మరోసారి లవ్‌స్టోరీతో ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీతో బాంధవి శ్రీధర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకొని కెరీర్‌లో మంచి సక్సెస్ సాధించి.. కెరీర్‌లో బిజీ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బాంధవి కెరీర్‌కు ఎంతవరకు టర్నింగ్ పాయింట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

SairaBhanu | హిందూ … ముస్లిం ప్రేమకథ – ఆది సాయికుమార్ సైరాభాను ఫస్ట్ లుక్ వచ్చేసింది!
ఆగస్టు 15, 2026

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు – అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ – డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 13, 2026

Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ – ఈ సారి సింగర్‌గా!
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
- ●NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్
- ●PPF | పోస్టాఫీసులోని పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్, సుకన్య ఖాతాలను బ్యాంకుకు మార్చుకోవచ్చా? పూర్తి వివరాలు ఇవే..
- ●Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
- ●Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్

Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్

PPF | పోస్టాఫీసులోని పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్, సుకన్య ఖాతాలను బ్యాంకుకు మార్చుకోవచ్చా? పూర్తి వివరాలు ఇవే..



