త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SairaBhanu | హిందూ … ముస్లిం ప్రేమ‌క‌థ – ఆది సాయికుమార్ సైరాభాను ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

శంబాల బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఆది సాయికుమార్ సైరాభాను పేరుతో ఓ వెరైటీ ల‌వ్‌స్టోరీ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం సైరాభాను ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో హిందూ అబ్బాయిగా ఆది సాయికుమార్, ముస్లిం యువ‌తిగా హీరోయిన్ బాంధ‌వి శ్రీధ‌ర్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

N

Entertainment | Published On Aug 15, 2026, 1.02 pm IST

SairaBhanu  | హిందూ … ముస్లిం ప్రేమ‌క‌థ – ఆది సాయికుమార్ సైరాభాను ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!
Advertisement

SairaBhanu |  శంబాల సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెద్ద‌ హిట్టును ద‌క్కించుకున్నాడు టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్‌. హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. శంబాల త‌ర్వాత సినిమాల‌కు స్మాల్ గ్యాప్ ఇచ్చిన ఆది సాయికుమార్ ఓ వెరైటీ ల‌వ్‌స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.సైరా భాను పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఫ‌ణి కృష్ణ సిరికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో బాంధ‌వి శ్రీధ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఫ‌స్ట్ లుక్‌....

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం సైరాభాను ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌తోనే సినిమా క‌థేమిట‌న్న‌ది చెప్పేశారు. ఈ పోస్ట‌ర్‌లో హీరోహీరోయిన్లు ఒకే బైక్‌పై జ‌ర్నీ చేస్తూ క‌నిపించారు. పంచెక‌ట్టులో న‌దుటిపై విభూదితో హిందూ యువ‌కుడిగా ఆది సాయికుమార్ క‌నిపిస్తుండ‌గా...ముస్లిం యువ‌తిగా హీరోయిన్ లుక్ ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. పోస్ట‌ర్ బ్యాక్‌గ్రౌండ్‌లో టెంపుల్‌తో పాటు మ‌సీద్ క‌నిపిస్తున్నాయి. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ‌క‌థ‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్‌ హింట్ ఇచ్చారు. ఆ యువ జంట ప్రేమ‌క‌థ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డంకిగా నిలిచాయ‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

శేఖ‌ర్ చంద్ర‌....

సైరాభాను మూవీని హాస్య మూవీస్ బ్యాన‌ర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement