Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ – బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
కేరళ స్టోరీ హీరోయిన్ అదా శర్మ పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కన్నడంలో ఛాన్స్ దక్కించుకుంది. ఓ మైథాలజీ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో తాంత్రిక విద్యలు తెలిసిన మంత్రగత్తెగా డీ గ్లామర్ పాత్రలో అదా శర్మ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 21, 2026, 3.33 pm IST
Adah Sharma | కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించింది ఆదా శర్మ. అల్లు అర్జున్, నితిన్ వంటి హీరోలతో సినిమాలు చేసింది. అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కలేదు. కేరళ స్టోరీతో తన రూటు మార్చింది. అందాల ప్రదర్శనతో కూడిన పాత్రలు, కథలకు దూరంగా ఉంటోంది. ఛాలెంజింగ్ రోల్స్‌ను ఎంచుకుంటోంది.
పదకొండేళ్ల తర్వాత...
తాజాగా అదా శర్మ దాదాపు పదకొండేళ్ల తర్వాత కన్నడ భాషలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన రణ విక్రమ సినిమాతో సాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది అదా శర్మ. రణవిక్రమ తర్వాత తెలుగులో బిజీగా ఉండటంతో కన్నడంలో ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది.
నేషనల్ అవార్డ్ విన్నర్...
లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మైథాలజీ మూవీతో సాండల్‌వుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బీఎమ్ గిరిరాజ్ దర్శకత్వంలో రామరస పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మైథాలజీ థ్రిల్లర్‌లో ప్రధాన నాయికగా అదా శర్మ ఛాన్స్ దక్కించుకుంది. సుడుగాడు తెగల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్లు సమాచారం. శ్మశానాలకు కాపలాదారులుగా వ్యవహరించే ఈ సంచార తెగల జీవితాలకు భక్తి అంశాలను జోడించి దర్శకుడు డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో తాంత్రిక విద్యలు తెలిసిన ఓ మంత్రగత్తెగా డీ గ్లామర్ పాత్రలో అదా శర్మ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె లుక్, క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంటాయని అంటున్నారు.
కన్నడ బిగ్‌బాస్ విన్నర్...
రామరస సినిమాలో అదా శర్మకుజోడీగా కన్నడ బిగ్‌బాస్ విన్నర్ కార్తిక్ మహేష్ కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రజ్వల్ దేవరాజ్, హెబ్బాపటేల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
హార్ట్ ఎటాక్...
నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన హార్ట్ ఎటాక్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అదా శర్మ. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, రాజశేఖర్ కల్కి, క్షణం, గరంతో పాటు పలు సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో సినిమాలు చేసింది. అదా శర్మ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ కేరళ స్టోరీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adah Sharma | సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న ఇంట్లోకి మారిన ఆదా శర్మ.. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న ఆ ఇంట్లో ఆమెకు ఎదురైన అనుభవాలు ఇవే
జూన్ 14, 2026

Adah Sharma | ఇండియా దివాళా తీస్తే … కేరళ స్టోరీ నిర్మాత కొత్త సినిమా …అదా శర్మ హీరోయిన్
ఏప్రిల్ 23, 2026

OTT | పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బాపటేల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ – కాల్ గర్ల్‌తో లాంగ్ డ్రైవ్ వెళితే…
మార్చి 27, 2026
తాజావార్తలు
- ●Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్
- ●Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం
- ●Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?

Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్

Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి



