Pragathi -Venuswamy | వేణు స్వామి పూజల వల్ల ఎలాంటి ఫలితం లేదు – నటి ప్రగతి కౌంటర్
సెలిబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామిపై సినీ నటి ప్రగతి ఫైర్ అయ్యింది. తాను చేసిన పూజల వల్లే ప్రగతి ఏషియన్ గేమ్స్‌లో గెలిచినట్లు వేణుస్వామి చేసిన కామెంట్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రగతి. కఠిన సాధనతోనే మెడల్స్ గెలిచానని వేణుస్వామి పూజల వల్ల కాదని అన్నది.
Entertainment | Published On Dec 24, 2025, 2.25 pm IST
వేణు స్వామి
Pragathi -Venuswamy | సెలిబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలుగు సినీ లవర్స్ అందరికి సుపరిచితుడే. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు వేణుస్వామి. ప్రభాస్, నాగచైతన్య, సమంతతో పాటు పలువురు స్టార్స్ గురించి వేణుస్వామి చెప్పిన జాతకాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జాతకాలు, పూజలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు వేణు స్వామి. తాజాగా నటి ప్రగతిని ఉద్దేశించి వేణుస్వామి చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సినీ నటి ప్రగతి ఓ గోల్డ్ మెడల్‌తో పాటు మూడు రజత పతకాలు సాధించింది. యాక్టింగ్‌లోనే కాకుండా క్రీడల్లో సత్తా చాటింది. ప్రగతిపై సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను చేసిన పూజల వల్లే ప్రగతి ఏషియన్ గేమ్స్‌లో మెడల్స్ గెలుచుకుందని వేణు స్వామి ఇటీవల కామెంట్స్ చేశారు.
పూజలు చేయించుకున్నా...
వేణుస్వామి వ్యాఖ్యలకు ప్రగతి గట్టి కౌంటర్ ఇచ్చింది. అతడి పూజల వల్లే తాను మెడల్స్ గెలవలేదని ప్రగతి అన్నది. పవర్ లిఫ్టింగ్‌లో గేమ్‌లో ఎన్నో ఏళ్లుగా తాను చేసిన కఠిన సాధన, నిరంతర కృషి వల్లే ఎషియన్ గేమ్స్‌లో విజయాన్ని సాధించానని చెప్పింది.. వేణుస్వామి వద్ద రెండున్నరేళ్ల క్రితం తాను పూజలు చేయించుకున్న మాట నిజమేనని ప్రగతి చెప్పింది. అయితే మానసికంగా ఒత్తిడిలో ఉన్న టైమ్‌లో ఆ పూజలు చేయించుకున్నానని తెలిపింది. స్నేహితుల సూచనతోనే తాను వేణు స్వామి వద్దకు వెళ్లానని... టైమ్ బాగోలేనప్పుడు పూజలు, జాతకాలను నమ్మడం సహజమని ప్రగతి పేర్కొన్నది.
కలిసిరాలేదు...
వేణుస్వామి పూజల వల్ల ఎలాంటి ఫలితం లేదని ప్రగతి చెప్పింది. సినిమాలతో పాటు పవర్ లిఫ్టింగ్‌లో అంతగా కలిసిరాలేదని చెప్పింది. ఎప్పుడో చేసిన పూజలకు, ఇప్పుడు తాను సాధించిన విజయానికి ముడిపెట్టడం కరెక్ట్ ప్రగతి ఆగ్రహం వ్యక్తం చేసింది. పూజల వల్లే తాను పతకాలు సాధించానని వేణుస్వామి చెప్పుకోవడం మానేస్తే మంచిదని అన్నది. ఒకరి విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని ప్రగతి ఫైర్ అయ్యారు.
సంబంధిత వార్తలు

Yogasana Championship | ప్రపంచ యోగాసన చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 102 స్వర్ణాలు..
జూన్ 9, 2026

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌ను స్కిప్ చేసిన జాన్వీ – అచ్చియమ్మ పేరు ఎత్తని చరణ్
జూన్ 8, 2026

Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..
- ●BRS Report on Dalith Christians | దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా.. బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం
- ●POCSO Case | బాలికపై లైంగిక దాడి.. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి తోసేసిన నిందితుడు
- ●DK Shivakumar | సగం కొరికిన యాపిల్స్‌ను జనంపైకి విసిరిన సీఎం డీకే శివకుమార్.. నెట్టింట దుమారం
- ●Allu Arjun | మైండ్‌బ్లోయింగ్ మూవీ - రామ్‌చరణ్ అదరగొట్టేశాడు - పెద్ది మూవీకి అల్లు అర్జున్ రివ్యూ

Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..

BRS Report on Dalith Christians | దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా.. బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం

POCSO Case | బాలికపై లైంగిక దాడి.. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి తోసేసిన నిందితుడు



