త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Laya | శివాజీని డామినేట్ చేశా… సీనియ‌ర్ హీరోయిన్ ల‌య కామెంట్స్‌

శివాజీ, ల‌య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ మార్చి 6న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత శివాజీ , ల‌య కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. ఈ మూవీతో పాటు త‌న పాత్ర గురించి ల‌య చెప్పిన సంగ‌తులివే...

N

Entertainment | Published On Mar 3, 2026, 5.08 pm IST

Laya | శివాజీని డామినేట్ చేశా… సీనియ‌ర్ హీరోయిన్ ల‌య కామెంట్స్‌
Advertisement

Laya |  సీనియ‌ర్ హీరోయిన్ ల‌య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ మార్చి 6న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. హీరో శివాజీ లీడ్ రోల్‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి స‌క్సెస్‌ల త‌ర్వాత శివాజీ, లయ కాంబినేష‌న్‌లో దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా ఇది. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విశేషాల‌ను హీరోయిన్‌ లయ పాత్రికేయుల‌తో పంచుకుంది.

ఇర‌వై ఏళ్ల త‌ర్వాత‌...

శివాజీ గారు నేను కలిసి నటించి 20 ఏళ్లు అవుతుంది. ఈ సినిమాతో మళ్లీ  మా కాంబో  సెట్టయ్యింది.  నాకు కామెడీ సినిమాలంటే ఇష్టం. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసనిలో కామెడీతో పాటు క్రైమ్‌, థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌ల‌తో డార్క్‌ కామెడీ జోనర్‌లో డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో నేను ఉత్తర అనే గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తా. నా యాక్టింగ్ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేయ‌లేదు. శివాజీని డామినేట్‌ చేసే పాత్ర నాది. డిఫ‌రెంట్ షేడ్స్‌తో ఉంటుంది. నా పేరు చెప్ప‌గానే అంద‌రికి సెంటిమెంట్ సినిమాలే గుర్తొస్తాయి. ఆ ఇమేజ్‌కు భిన్నంగా సాగే క్యారెక్ట‌ర్ ఇది. నా భర్త బాగుండాలి మిగిలిన వాళ్లు ఏమైనా ప‌ర్వాలేద‌ని స్వార్థంగా ఆలోచించే రోల్ చేశా.

ప‌ర్మినెంట్ కాదు

లీడ్ రోల్స్ ప‌ర్మినెంట్ కాదు. వస్తే చేస్తాను. కథ, నా పాత్ర నచ్చితే చిన్నపాత్రలు చేయ‌డానికైనా రెడీగా ఉన్నా. సాఫ్ట్‌ రోల్స్‌ఆల్రెడీ చాలా చేశాను. కాబట్టి స్ట్రాంగ్‌ క్యారెకర్స్‌ చేయాలని ఉంది. నేను బేసికల్‌గా చూడ్డానికి స్టాప్ట్‌గా ఉన్నా నేను ఏదైనా చెప్పాలంటే బ‌లంగా చెబుతాను.

య‌మ‌లీల లాంటి మూవీ...

ప్ర‌స్తుతం వదల పేరుతో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నా. ఇందులో జగపతిబాబు భార్యగా క‌నిపిస్తా. శ్రీకాంత్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర రెడ్డి దర్వకుడు. యమలీల తరహాలో సోషియో ఫాంట‌సీ జాన‌ర్‌లో ఈ మూవీ ఉంటుంది.

Advertisement
Advertisement