Ayesha Khan | సోషల్ మీడియాలో వేధింపులు.. ఆవేదన వ్యక్తం చేసిన ధురంధర్ బ్యూటీ ఆయేషా ఖాన్..!
Ayesha Khan | ఆయేషా ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. గతేడాది ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ధురందర్ మూవీలో స్పెషల్ సాంగ్ ‘షెరారత్’తో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇటీవల ఓ సాంగ్ నుంచి తొలగించడం, ఇస్టాగ్రామ్ వేదికగా ప్రతిరోజూ వస్తున్న వేధింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Entertainment | Published On Mar 4, 2026, 3.40 pm IST
Ayesha Khan | ఆయేషా ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. గతేడాది ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘షెరారత్’తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా, ఓ సాంగ్ నుంచి తనను లావుగా ఉన్నానని తొలగించారని.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రతిరోజూ ఎదురయ్యే వేధింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి రోజు తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యమైన వ్యాఖ్యలు వస్తున్నాయని, ‘వీ ది ఉమెన్’ కార్యక్రమంలో వెల్లడించింది.
పదో తరగతిలో ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ సాంగ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చిందని, కానీ షూటింగ్‌కు ఒక రోజు ముందు తనను లావుగా ఉన్నావంటూ తొలగించారని వెల్లడించింది. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని, ఆ బాధ నుంచి బయటపడడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ తన శరీరంపై అసభ్యమైన వ్యాఖ్యలు వస్తాయని, ఏ పోస్ట్ పెట్టినా కొందరికీ ఏదో సమస్యగా కనిపిస్తుందని, అందువల్ల ఏం పోస్ట్ చేయాలో ఆలోచించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. లేకపోతే ఈ పరిస్థితి కొనసాగుతుందేమోనని, ఇది తన మనసును గాయపరుస్తుందని వాపోయింది.
ఆయేషా ఖాన్ సినిమాల విషయానికి వస్తే తొలుత జూనియర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టింది. ఏక్తా కపూర్ నిర్మించిన ‘కసౌతి జిందగీ కేలో’తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాల్వీర్ రిటర్న్స్‌లోనూ నటించింది. 2023లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్-17లో కనిపించింది. తర్వాత, ఆమె యూట్యూబ్‌లో ప్రసారమైన దిల్ కో రఫు కర్ లీ షోతో మరింత గుర్తింపు పొందింది. 2022లో తెలుగులో ముఖచిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ భీం బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే మూవీల్లోనూ నటించింది. ఆ తర్వాత జాట్ మూవీలో మెరిసింది. ఇక గతేడాది ధురంధర్ మూవీలో షెరారత్ స్పెషల్ సాంగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. చివరగా కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 మూవీలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం తెలుగులో వచ్చినవాడు గౌతమ్ మూవీలో కీలకపాత్రలో నటిస్తోంది.
Read Also :
Rashi Khanna | జీవితం ఎటు తీసుకువెళ్తే అటే.. సినీ కెరీర్‌పై రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!
Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్
OTT | గంటకు నాలుగు రూపాయలే మాకు మిగిలేది – గుప్పెడంత మనసు రిషి డెబ్యూ మూవీ దర్శకుడి ట్వీట్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






