Actor Vijay | కరూర్ తొక్కిసలాట కేసు.. రేపు సీబీఐ విచారణకు విజయ్..!
Actor Vijay | ప్రముఖ తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరుకానున్నారు. గతేడాది కరూర్‌లో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని విజయ్‌కి సీబీఐ సమన్లు జారీ చేసింది.
P
Pradeep Manthri
Entertainment | Jan 11, 2026, 6.09 pm IST
















