త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajendra Prasad | దిగ్గ‌జ న‌టుడిపై అస‌భ్య‌క‌ర‌ కామెంట్లు – రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్‌

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను కోలీవుడ్ సినీ వ‌ర్గాలు ట్రోల్ చేస్తున్నాయి. క‌త్తి కాంతారావు స్మార‌క జాతీయ పుర‌స్కార వేడుక‌లో కాంతారావును చూసి ఎమ్జీఆర్ ఉ..*పోసుకునేవాడంటూ అభ్యంత‌ర‌క‌ర‌మైన కామెంట్లు చేశాడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌.

N

Entertainment | Published On Mar 10, 2026, 4.42 pm IST

Rajendra Prasad | దిగ్గ‌జ న‌టుడిపై అస‌భ్య‌క‌ర‌ కామెంట్లు – రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్‌
Advertisement

Rajendra Prasad | టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. త‌మిళ లెజెండ‌రీ యాక్ట‌ర్ ఎమ్జీఆర్‌పై అనుచిత‌ వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న్ని కోలీవుడ్ సినీ వ‌ర్గాలు ట్రోల్ చేస్తున్నాయి. నటప్రపూర్ణ కత్తి కాంతరావు స్మారక జాతీయ పుర‌స్కారాన్ని ఇటీవ‌ల రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ప్ర‌క‌టించారు. ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

భ‌యంతో వ‌ణికిపోయేవాడు...

ఈ వేడుక‌లో కాంతారావు గొప్ప‌త‌నాన్ని గురించి చెప్పే క్ర‌మంలో ఎమ్జీఆర్‌పై రాజేంద్ర‌ప్ర‌సాద్ అభ్యంత‌ర‌క‌ర కామెంట్లు చేశాడు. సినిమాల ప‌రంగా కాంతారావు వ‌చ్చిన పేరుప్ర‌ఖ్యాతులు చూసి ఎమ్జీఆర్ ఉ....పోసుకున్నాడంటూ రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నాడు." కాంతారావు జాన‌ప‌ద సినిమా అనౌన్స్‌చేశాడంటే ఎమ్జీఆర్ భ‌యంతో వ‌ణికిపోయేవాడు. ఇండియ‌న్ సినిమాను త‌న‌వైపుకు తిప్పుకుంటున్నాడంటూ ఎమ్జీఆర్ ఉ...పోసుకునేవాడు" అంటూ ఈ వేడుక‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించాడు. ఎమ్జీఆర్ గురించి ప‌దే ప‌దే రాయ‌లేని ప‌దాల‌తో కించ‌ప‌రుస్తూ మాట్లాడారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఈ సీనియ‌ర్ న‌టుడి వ్యాఖ్య‌ల‌పై కోలీవుడ్ వ‌ర్గాలు ఫైర్ అవుతున్నారు.

ట్రోల్‌....

తెలుగు న‌టుడి గొప్ప‌ల‌ను గురించి చెప్ప‌డం కోసం తాను దైవంగా ఆరాధించే ఎమ్జీఆర్‌ను కించ‌ప‌రిచ‌డం క‌రెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్జీఆర్ గొప్ప‌త‌నం తెలియ‌కుండా మాట్లాడొద్దు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

బూతుల వ‌ర్షం...

ఇటీవ‌ల ప‌లుమార్లు నోరు జారి చిక్కుల్లో ప‌డ్డారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. సినిమా వేడుక‌ల్లో క‌మెడియ‌న్లు బ్ర‌హ్మానందం, అలీల‌పై బూతుల‌తో రెచ్చిపోయారు. అంద‌రి ముందే అస‌భ్య‌క‌రంగా వారిని ఉద్దేశించి రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన కామెంట్ల‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. రాబిన్‌హుడ్ సినిమా వేడుక‌లో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌పై ఇలాగే స‌ర‌దా కోసం రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన కామెంట్లు మిస్‌ఫైర్ అయ్యాయి. తానా స‌భ‌లో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావును కించ‌ప‌రుస్తూ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement