Rajendra Prasad | జెన్‌జీకి నచ్చే మసాలాలు ఉన్న సినిమా – “పిఠాపురంలో అలా జరిగింది” మూవీపై రాజేంద్రప్రసాద్ కామెంట్స్
49 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో మంచి పాత్రలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుంది. ప్రేయసి రావే ఫేమ్ చంద్ర మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Sep 14, 2026, 2.10 pm IST
Rajendra Prasad |దిగ్గజ రచయిత సీ నారాయణరెడ్డి తనకు నటకిరీటి అనే బిరుదు ఇచ్చారని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుంది. ప్రేయసి రావే ఫేమ్ చంద్ర మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సుమన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పిఠాపురంలో అలా మొదలైంది సినిమాను విడుదల చేస్తోంది.
ఆ నలుగురు చూసి...
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ 49 సంవత్సరాల సినిమా జీవితంలో ఎన్నో గుర్తుండిపోయే మంచి పాత్రలు దొరకడం నా అదృష్టం. ఇదే ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ ‘ఆ నలుగురు’ సినిమా చూసి ఇందులో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు రచయిత సీ నారాయణరెడ్డి ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. నాతో సినిమాలు తీసిన దర్శకుల గొప్పతనం" అని తెలిపారు.
కష్టాలు భరించి...
"చంద్రమహేష్ ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. అందరి ఇళ్లలో వుండే కథతో ఈ సినిమా రూపొందింది. క్లైమాక్స్ ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తుంది. ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో వున్నాయి అని రాజేంద్రప్రసాద్ చెప్పారు అన్నారు.
ప్రాణం పెట్టి చేశా...
చంద్ర మహేష్‌తో తనకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడదని సుమన్ అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. రాజేంద్రప్రసాద్‌తో పాటు ప్రతి ఒక్క నటుడు తమ తమ పాత్రల్లో జీవించారు. గ్యారెంటీగా హిట్ అవుతుంది. దర్శకుడిగా నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుంది’ అని అన్నారు.ప్రేమలు, పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ ఉన్నంత వరకు ఈ సినిమా ఉంటుందని రైటర్ బీవీఎస్ రవి అన్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్లు సముద్ర, రాంప్రసాద్, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు.
సన్నీ...అఖిల్...
‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీలో సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటించారు. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు.
.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreevishnu | శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ – సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ సినిమాలతో పోటీ
సెప్టెంబర్ 14, 2026

Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక – రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ
సెప్టెంబర్ 14, 2026

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ – తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●AI | ఏఐతో మానవాళికి ముప్పే.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..
- ●Sreevishnu | శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ - సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ సినిమాలతో పోటీ
- ●BAPS | బాప్స్ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస వివాదాల ఉప్పెన
- ●Monsoon Diseases | వర్షాకాలంలో తరచూ వచ్చే 8 రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇవే.. వీటితో జాగ్రత్త..
- ●Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ
- ●Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ

AI | ఏఐతో మానవాళికి ముప్పే.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..

Sreevishnu | శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ - సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ సినిమాలతో పోటీ

BAPS | బాప్స్ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస వివాదాల ఉప్పెన

Monsoon Diseases | వర్షాకాలంలో తరచూ వచ్చే 8 రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇవే.. వీటితో జాగ్రత్త..



