Nana Patekar | బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
Nana Patekar | బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత నానా పటేకర్ (Nana Patekar) కన్నుమూశారు. గురువారం ఉదయం గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో అపస్మారక స్థితిలో గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు.
Nana Patekar | త్రినేత్ర న్యూస్: బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత నానా పటేకర్ (Nana Patekar) కన్నుమూశారు. గురువారం ఉదయం గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో అపస్మారక స్థితిలో గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉదయం 5.20 గంటల సమయంలో మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పటేకర్ మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1951 జనవరి 1న బాంబేలో జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్ (Vishwanath Patekar). 1978లో గమన్ (Gaman) సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన విలక్షణమైన నటనా శైలి, విప్లవాత్మక డైలాగ్ డెలివరీతో భారతీయ చలనచిత్ర రంగంలో ప్రత్యేకంగా బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. 1989లో వచ్చిన పరిందా (Parinda) చిత్రంలో పోషించిన విలన్ పాత్ర ఆయన కెరీర్‌కు భారీ బ్రేక్ ఇచ్చింది. ప్రహార్ (1991) సినిమాతో దర్శకుడిగా మారారు. క్రాంతివీర్ (1994) మూవీలో సామాజిక అన్యాయాలపై పోరాడే పాత్రలో ఆయన చెప్పిన డైలాగులు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అంకృష్, అంగార్, తిరంగా, అగ్నిసాక్షి, అబ్ తక్ ఛప్పన్, రాజనీతి, వెల్కమ్, మరాఠీ క్లాసిక్ మూవీ `నటసామ్రాట్` చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

అవార్డులు..
ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో నానా పటేకర్ పలు ఫిలింఫేర్ అవార్డులతోపాటు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. ఫిలింఫేర్ చరిత్రలో ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ విలన్ విభాగాల్లో అవార్డులు అందుకున్న ఏకైక నటుడిగా రికార్డు సృష్టించారు. 1995లో అత్యుత్తమ నటనకు గాను నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. సినిమా, కళారంగాలకు ఆయన చేసిన విశేష కృషికిగాను 2013లో కేంద్ర ప్రభుత్వం ఆయనను `పద్మశ్రీ` పురస్కారంతో సత్కరించింది.
జాతీయ చలనచిత్ర పురస్కారాలు..
ఉత్తమ సహాయ నటుడు- పరిందా (1989)
ఉత్తమ నటుడు- క్రాంతివీర్ (1994)
ఉత్తమ సహాయ నటుడు- అగ్నిసాక్షి (1996)
ఫిలింఫేర్ పురస్కారాలు..
ఉత్తమ సహాయ నటుడు- పరిందా (1990)
ఉత్తమ విలన్- అంగార్ (1993)
ఉత్తమ నటుడు- క్రాంతివీర్ (1995)
ఉత్తమ విలన్- అపహరణ్ (2006)
సంబంధిత వార్తలు

AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
అక్టోబర్ 9, 2026

Nana Patekar | నానా పటేకర్ మృతి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
అక్టోబర్ 9, 2026

Nana Patekar | కార్గిల్ యుద్ధంలో పోరాడిన నానా పటేకర్ – షూటింగ్లో నేషనల్ మెడల్స్
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●Road Accident | ఆమెకు ఇంకా భూమ్మీద నూకలు ఉన్నయ్.. వీడియో
- ●Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట - కమ్మరోళ్ల గంగగా శర్వానంద్
- ●Vakiti Srihari | పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అండగా ప్రభుత్వం : మంత్రి వాకిటి
- ●Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్!
- ●Jupally Krishna Rao | పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి
- ●Gadari Kishore | రాహుల్ లెక్క మేం నిరసనలు తెలపొద్దా రేవంత్?

Road Accident | ఆమెకు ఇంకా భూమ్మీద నూకలు ఉన్నయ్.. వీడియో

Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట - కమ్మరోళ్ల గంగగా శర్వానంద్

Vakiti Srihari | పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అండగా ప్రభుత్వం : మంత్రి వాకిటి

Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్!



