Vakiti Srihari | పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అండగా ప్రభుత్వం : మంత్రి వాకిటి
Vakiti Srihari | రాష్ట్రంలో పౌల్ట్రీ రంగ( Poultry Sector ) అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి మంత్రి వాకిటి శ్రీహరి( Vakiti Srihari ) స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఎగ్ దినోత్సవం( International Egg Day ) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో పౌల్ట్రీ రంగ( Poultry Sector ) అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి మంత్రి వాకిటి శ్రీహరి( Vakiti Srihari ) స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఎగ్ దినోత్సవం( International Egg Day ) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
గుడ్డు( Egg ) ఉత్పత్తి అనేది కేవలం కోళ్ల పెంపకానికే పరిమితం కాదని, దాని వెనుక రైతులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, పశువైద్యులు, శాస్త్రవేత్తలు, రవాణా, మార్కెటింగ్ రంగాలకు చెందిన అనేక మంది శ్రమ దాగి ఉందని మంత్రి అన్నారు. పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందితే రైతులకు ఉపాధి, ప్రజలకు పోషకాహారం అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే పౌల్ట్రీ రంగంలోని సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమ ప్రతినిధులు, పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

పౌల్ట్రీ రంగానికి పూర్తి సహకారం
పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అవసరమైన అంశాలను పరిశ్రమ ప్రతినిధులతో చర్చించి, ప్రభుత్వ స్థాయిలో పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం, రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, వైద్య నిపుణులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గుడ్డు పోషకాహారానికి చక్కని మార్గం
గుడ్డు, పాలు, మాంసం వంటి పోషకాహార పదార్థాల వినియోగంపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సమతుల ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని మంత్రి అన్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి పోషకాహార ప్రాధాన్యతను వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ గుడ్డు పోషక విలువల గురించి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గుడ్డు పోషక విలువలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు, పౌల్ట్రీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, పౌల్ట్రీ రంగం యజమానులు, ముఖ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ




