త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్‌!

Katrina Kaif | సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, కామెంట్స్‌ను అతిగా పట్టించుకుంటే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పేర్కొంది. ఇతరులను మెప్పించేందుకు ప్రయత్నించడం కంటే మనల్ని మనం అంగీకరించడమే ముఖ్యమని తెలిపింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందిస్తూ పోతే సొంత నిర్ణయాలు తీసుకోలేమని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

P

Entertainment | Published On Oct 9, 2026, 6.27 pm IST

Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్‌!
Advertisement

Katrina Kaif | సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, కామెంట్స్‌ను అతిగా పట్టించుకుంటే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పేర్కొంది. ఇతరులను మెప్పించేందుకు ప్రయత్నించడం కంటే మనల్ని మనం అంగీకరించడమే ముఖ్యమని తెలిపింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందిస్తూ పోతే సొంత నిర్ణయాలు తీసుకోలేమని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కాస్మెటిక్ బ్రాండ్‌ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా యూకేలో నిర్వహించిన కార్యక్రమంలో కత్రినా మాట్లాడింది. సోషల్ మీడియాలో వ్యక్తమయ్యే అభిప్రాయాలు మన ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. 'సోషల్ మీడియాలో ఎన్నో రకాల అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. వాటన్నింటినీ అనుసరిస్తూ పోతే మన సొంత నిర్ణయాలు తీసుకోలేం. ఇతరులు ఏమనుకుంటున్నారనే దానికే ప్రాధాన్యమిస్తే జీవితంలో ముందుకు వెళ్లడం కష్టమవుతుంది. కొన్నిసార్లు ప్రపంచమంతా మనల్ని ప్రశంసిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మనకు మనమే అతిపెద్ద మద్దతుదారులుగా నిలవాలి' అని కత్రినా వ్యాఖ్యానించింది. జీవితంలో ఎదురయ్యే వివిధ దశలను అంగీకరించాలని చెప్పింది. మనపై మనకు ఉండే నమ్మకం, మనల్ని మనం చూసుకునే విధానం ఎప్పుడూ ఒకేలా ఉండవని తెలిపింది. కొన్ని రోజులు మన గురించి మనం ఎంతో గొప్పగా భావిస్తామని, మరికొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

ఆ విమర్శల నేపథ్యంలోనేనా?

ఇటీవల భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకలకు కత్రినా హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ప్రసవం తర్వాత ఆమె బరువు పెరగడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కత్రినా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండ‌గా.. కత్రినాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. వారిలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. 'బిగ్‌బాస్' కార్యక్రమంలోని 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో సెలబ్రిటీల శరీరాకృతి, వయసు, అందం, వ్యక్తిగత జీవితాలపై నిరంతరం విమర్శలు చేసే ధోరణిని స‌ల్లుభాయ్ త‌ప్పుప‌ట్టాడు. కత్రినా పేరు ప్రస్తావించకుండానే.. ఆమె సినిమాల్లోకి తిరిగి వచ్చినప్పుడు ఫిట్‌గా మారుతుందని తెలిపాడు. కాగా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2025లో ఈ దంపతులు ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చే మార్పులపై విమర్శలు చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. ఆత్మవిశ్వాసం, స్వీయ అంగీకారంపై కత్రినా చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

Advertisement
Advertisement