త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Induja | కేటీఆర్‌పై పోలీసుల‌కు బల్మూర్‌ వెంకట్‌ భార్య ఫిర్యాదు

Induja | సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ భార్య ఇందుజా కోరారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

P

Hyderabad | Published On Oct 28, 2026, 10.13 pm IST

Induja | కేటీఆర్‌పై పోలీసుల‌కు బల్మూర్‌ వెంకట్‌ భార్య ఫిర్యాదు
Advertisement
  • రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపణ

Induja | సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ భార్య ఇందుజా కోరారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించే సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తన ఫొటోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన భర్తను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తన భర్త చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, తనపై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆ ఆరోపణలకు తమ వద్ద ఆధారాలున్నాయని, తమపై చేస్తున్న ప్రచారానికి సంబంధించి ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్‌ విసిరారు.

తాను అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటోలను సైతం తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు. తమ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోలను కూడా వక్రీకరించి తప్పుడు ప్రచారానికి ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన భర్తతో స్నేహితులు దిగిన ఫొటోలను వక్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేటీఆర్‌ సహించగలరా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారాన్ని ఇతరుల కుటుంబాల విషయంలోనూ చేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతినని, తన భర్త మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ.. ఇద్దరూ ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి, అందరి సమక్షంలో వివాహం చేసుకున్నామని ఆమె తెలిపారు. తమ వివాహాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కులం పేరుతో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, నిరాధార ప్రచారాల కారణంగా ఎంతోమంది మహిళలు అవమానాలకు గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని మహిళలపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement