Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్జిత సేవల టికెట్ల షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన టీటీడీ..!
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జూన్ మాసానికి సంబంధించిన ఆర్జితసేవ, ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించిన కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
Devotional | Published On Mar 16, 2026, 6.42 pm IST
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జూన్ మాసానికి సంబంధించిన ఆర్జితసేవ, ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించిన కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని చెప్పింది. డిప్‌లో టికెట్లు పొందిన వారంతా 22న మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.
ఈ నెల 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు పేర్కొంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ రిలీజ్ చేస్తామని చెప్పింది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వివరించింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు





