త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | మార్చి 3న ప‌ది గంట‌లు మూత‌ప‌డ‌నున్న శ్రీ‌వారి ఆల‌యం..!

TTD | మార్చి 3న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేయ‌నున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా మూసివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం.. గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయ ద్వారాలను మూసివేయడం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

P

Devotional | Published On Feb 27, 2026, 9.05 pm IST

TTD | మార్చి 3న ప‌ది గంట‌లు మూత‌ప‌డ‌నున్న శ్రీ‌వారి ఆల‌యం..!
Advertisement

TTD | మార్చి 3న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేయ‌నున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా మూసివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం.. గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయ ద్వారాలను మూసివేయడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. మార్చి 3న మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వ‌ర‌కు గ్ర‌హ‌ణం కొన‌సాగ‌నున్న‌ది. ఈ క్ర‌మంలో ఉద‌యం 9 గంట‌ల‌కు ఆల‌యాన్ని ద్వారాల‌ను మూసివేయ‌నున్న‌ట్లు తెలిపింది.

గ్ర‌హ‌ణం ముగిశాక సాయంత్రం 7.30 గంట‌ల‌కు తిరిగి ఆల‌యాన్ని తెరువ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. దాదాపు ప‌దిన్న‌ర గంట‌ల పాటు ఆల‌యం మూత‌ప‌డ‌నున్న‌ది. ఆల‌యాన్ని తెరిచిన త‌ర్వాత శుద్ధి, పుణ్యాహవచనం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. రాత్రి 8.30 గంట‌ల నుంచి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తించ‌నున్న‌ట్లు దేవ‌స్థానం తెలిపింది. గ్ర‌హ‌ణం నేప‌థ్యంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు భ‌క్తులు ద‌ర్శ‌నానికి ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని సూచించింది.

చంద్ర‌గ్ర‌హ‌ణం నేప‌థ్యంలో తిరుప‌తితో పాటు తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కేంద్రాల‌ను మూసివేయ‌నున్న‌ట్లు దేవ‌స్థానం పేర్కొంది. తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌లో ఉన్న ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు వివ‌రించారు. తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది చెప్పింది. గ్ర‌హ‌ణం త‌ర్వాత తిరిగి అన్న ప్ర‌సాద విక్ర‌య కేంద్రాలు తిరిగి తెరుచుకుంటాయ‌ని వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement