Brahmotsavam 2026 | భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం
Brahmotsavam 2026 | గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి. అడుగడుగునా హారతులు.. చుట్టూ భక్తజన సందోహం.. మధ్యలో మహోన్నత రథంపై ఉభయదేవేరులతో కొలువుదీరిన శ్రీమలయప్పస్వామి.. భక్తిపారవశ్యంతో సాగిన శ్రీవారి రథోత్సవం తిరుమల కొండపై ఆధ్యాత్మిక శోభను నింపింది.
Devotional | Published On Sep 22, 2026, 3.46 pm IST
Brahmotsavam 2026 | గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి. అడుగడుగునా హారతులు.. చుట్టూ భక్తజన సందోహం.. మధ్యలో మహోన్నత రథంపై ఉభయదేవేరులతో కొలువుదీరిన శ్రీమలయప్పస్వామి.. భక్తిపారవశ్యంతో సాగిన శ్రీవారి రథోత్సవం తిరుమల కొండపై ఆధ్యాత్మిక శోభను నింపింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు రథానికి కట్టిన తాళ్లను పట్టుకుని స్వామివారి రథాన్ని లాగుతూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
హరినామస్మరణతో..

ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామివారు రథంపై విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించారు. ‘గోవిందా.. గోవిందా’ అంటూ చేసిన నామస్మరణతో తిరుమాడ వీధులు ప్రతిధ్వనించాయి. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమలలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రథోత్సవం సజావుగా, సురక్షితంగా జరిగేలా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఆర్ష సంప్రదాయంలో విశిష్ట స్థానం

రథోత్సవానికి ఆర్ష సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. అనాదికాలం నుంచి రాజులకు రథసంచారం ప్రసిద్ధమైంది. యుద్ధాల్లోనూ రథాలను విస్తృతంగా ఉపయోగించినట్లు భారతాది ఇతిహాసాలు, పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడని ఆర్ష గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠింపజేసి ఊరేగించే సంప్రదాయం ఆగమశాస్త్ర సమ్మతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి రథోత్సవం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
రథస్థం కేశవం దృష్ట్వా..

‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ అనే ఆర్షవాక్యం రథంపై కొలువుదీరిన శ్రీకేశవుని దర్శన మహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. రథంపై స్వామివారిని దర్శించుకోవడం పరమపవిత్రమనే భావనతో భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. రథాన్ని స్వయంగా లాగుతూ స్వామివారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. రథోత్సవానికి భక్తిభావంతో పాటు లోతైన తాత్త్విక సందేశం కూడా అంతర్లీనంగా ఉంది. కఠోపనిషత్తు ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సును పగ్గాలుగా, ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తుంది. ఇంద్రియాలకు విషయాలే మార్గాలని పేర్కొంటూ ఆత్మ–అనాత్మ వివేకాన్ని ఉపదేశిస్తుంది. రథోత్సవం ఈ ఆధ్యాత్మిక తత్త్వాన్ని భక్తులకు గుర్తుచేస్తుంది. భక్తులు రథాన్ని లాగుతున్నా.. సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన భక్తులను అనుగ్రహిస్తూ తన రథాన్ని తానే నడిపిస్తున్నాడనే భావన ఈ ఉత్సవంలో అంతర్లీనంగా ఉంటుంది. భక్తి, ఆత్మచింతన, పరమాత్మపై సంపూర్ణ విశ్వాసానికి రథోత్సవం ప్రతీకగా నిలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Abortion | అబార్షన్ విషయంలో మహిళదే తుది నిర్ణయం.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
- ●NYTTA | న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
- ●Ranabaali | చూడముచ్చటగా విజయ్, రష్మిక కెమిస్ట్రీ - రణబాలి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే

Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక

OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Abortion | అబార్షన్ విషయంలో మహిళదే తుది నిర్ణయం.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు






