Abortion | అబార్షన్ విషయంలో మహిళదే తుది నిర్ణయం.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
Abortion | బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం (Nagpur Bench of the Bombay High Court) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తన శరీరంపై మహిళకే పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 17 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు (Abortion) అనుమతించింది.
Abortion | త్రినేత్ర.న్యూస్ : బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం (Nagpur Bench of the Bombay High Court) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు (Abortion) అనుమతించింది. తన శరీరంపై మహిళకే పూర్తి హక్కు ఉంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏ మహిళనైనా, ముఖ్యంగా అత్యాచార బాధితురాలైన మైనర్‌ను ఇష్టం లేని గర్భాన్ని మోసేలా బలవంతం చేయలేమని కోర్టు పేర్కొంది. అది ఆమె మానసిక, శారీరక ఆరోగ్యానికి తీవ్ర భంగం కలిగిస్తుందని అభిప్రాయపడింది.
అత్యాచారం కారణంగా 17 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె 28 వారాల ప్రెగ్నెంట్ (28 Week Pregnancy). అయితే, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం అత్యాచారం లేదా లైంగిక దాడికి గురైన బాధితులు సాధారణంగా 24 వారాల వరకు గర్భస్రావం చేయించుకోవడానికి చట్టం అనుమతిస్తుంది. 24 వారాల గడువు దాటితే మాత్రం చట్టపరమైన, వైద్య పరమైన ప్రత్యేక ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో బాధితురాలు తన తండ్రి ద్వారా గర్భస్రావం కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ అనిల్ ఎస్. కిలోర్, జస్టిస్ రాజనీశ్ ఆర్. వ్యాస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
అవాంఛిత లేదా అనుకోని గర్భం అనేది సదరు మహిళపై తీవ్రమైన మానసిక, శారీరక భారాన్ని మోపుతుందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు గత తీర్పుల ఆధారంగా బాధితురాలి శరీర స్వయంప్రతిపత్తి (Bodily Autonomy)కే అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు గర్భస్రావానికి అనుమతిస్తూ కీలక తీర్పు వెలువరించింది. తక్షణమే అవసరమైన భద్రతా ప్రమాణాలతో గర్భస్రావ ప్రక్రియను పూర్తి చేయాలని నాగపూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) డీన్‌ను కోర్టు ఆదేశించింది. మరోవైపు అత్యాచార ఘటనపై క్రిమినల్ దర్యాప్తు కొనసాగుతున్నందున చట్టపరమైన సాక్ష్యాల కోసం పిండం నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి భద్రపరచాలని స్థానిక పోలీసులను కోర్టు ఆదేశించింది.
Also Read..
చూడముచ్చటగా విజయ్, రష్మిక కెమిస్ట్రీ - రణబాలి ఫస్ట్ సింగిల్ రిలీజ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Disha Salians | దిశా సాలియన్ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన బాంబే హైకోర్టు
సెప్టెంబర్ 2, 2026

Nitin Gadkari | అసహ్యకరమైన కంటెంట్‌ను తొలగించండి.. ఈ20 వివాదంలో నితిన్ గడ్కరీకి ఊరట
ఆగస్టు 5, 2026

Bombay High Court | రెండు పురుగులు కనిపించినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేస్తారా..? ఎఫ్‌డీఏ చర్యలను తప్పుబట్టిన బాంబే హైకోర్టు
జులై 30, 2026
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | హాస్యాస్పదంగా సర్ ప్రక్రియ : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Harish Rao | యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలి.. కానీ జీ13, జీ14 క్వాలిటీదే వాడుతున్నారు
- ●High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
- ●Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..
- ●Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి

MLC Dasoju Sravan | హాస్యాస్పదంగా సర్ ప్రక్రియ : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Harish Rao | యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలి.. కానీ జీ13, జీ14 క్వాలిటీదే వాడుతున్నారు

High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్

Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..



