Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు
Sabarimala | శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. భక్తులు కేరళలో ఏ ప్రాంతం నుంచైనా నేరుగా పంపా (Pampa) వరకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను చార్టర్ చేసుకోవచ్చని కేరళ రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్ (CP John) ప్రకటించారు.
Sabarimala | త్రినేత్ర న్యూస్ : శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం (Kerala) గుడ్‌న్యూస్ చెప్పింది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) తరఫున ఓ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భక్తులు కేరళలో ఏ ప్రాంతం నుంచైనా నేరుగా పంపా (Pampa) వరకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను చార్టర్ చేసుకోవచ్చని కేరళ రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్ (CP John) ప్రకటించారు.
ఈ చార్టర్డ్ సర్వీసులకు అదనపు ఛార్జీలు ఏవీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. భక్తులు ఉన్న చోటు కే బస్సులు వెళ్లి వారిని ఎక్కించుకుని నేరుగా పంపా వద్ద దించుతాయని చెప్పారు. అయితే, ఈ సేవలకు కనీసం 45 టికెట్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు. భక్త బృందాలు కలిసి ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా, గతంలో శబరిమల వెళ్లే భక్తులు నిలక్కల్ బేస్ క్యాంప్ వద్దే ప్రైవేట్ వాహనాలను నిలిపివేసి.. అక్కడి నుంచి పంపాకు వేరే బస్సులు మారాల్సి వచ్చేది. దీనివల్ల భక్తులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
Also Read..
సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే
విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు
యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sabarimala Crown Row | శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయం..?
సెప్టెంబర్ 24, 2026

KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?
సెప్టెంబర్ 8, 2026

Mohan Lal | శబరిమలలో షూటింగ్‌లకు “నో” పర్మిషన్ – మోహన్‌లాల్ సినిమాకు అనుమతి నిరాకరణ
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●KTR | బలహీనంగా భారతీయ జనతా పార్టీ
- ●Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే
- ●Deepika Padukone | తల్లయిన నెల రోజులకే కెమెరా ముందుకు దీపికా పడుకోణ్ - షారుఖ్ ఖాన్ కింగ్‌తో రీఎంట్రీ
- ●CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్య పర్చాలి
- ●MP Mallu Ravi | బీజేపీవి దృష్టి మళ్లింపు రాజకీయాలు: ఎంపీ మల్లు రవి
- ●TGSPF | తెలంగాణ ప్రగతికి టీజీఎస్పీఎఫ్ రక్షణ కవచం

KTR | బలహీనంగా భారతీయ జనతా పార్టీ

Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే

Deepika Padukone | తల్లయిన నెల రోజులకే కెమెరా ముందుకు దీపికా పడుకోణ్ - షారుఖ్ ఖాన్ కింగ్‌తో రీఎంట్రీ

CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్య పర్చాలి



