Maha Shivratri | వేములవాడకు పోటెత్తిన భక్తులు.. వైభవంగా శివరాత్రి వేడుకలు
Maha Shivratri | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులు దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
Devotional | Published On Feb 15, 2026, 4.09 pm IST
Maha Shivratri | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులు దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు తరలివచ్చారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు రాజన్నకు పట్టువస్త్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. శివరాత్రి సందర్భంగా అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాజన్న ఆలయ విస్తరణ సందర్భంగా స్వామివారిని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. పలువురు భక్తులు ప్రధాన ఆలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్సవాల ఏర్పాట్లను ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆలయ అభివృద్ధి కోసం పోరాటం : పొన్నం
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వేములవాడ ప్రాముఖ్యత కలిగిన దేవాలయమన్నారు. ఆనాడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయం, సమ్మక్క సారలమ్మ ఆలయం పేదల దేవుడు ప్రజల విశ్వాసంతో అభివృద్ధి చేస్తుందన్నారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని స్వామివారిని కురుకున్నట్లు చెప్పారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ పరమ శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ లో ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. దక్షిణ కాశిగా పేరుగాంచిన ఆలయాన్ని.. రూ.150 కోట్లతో నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు సీఎం, మంత్రులు ఆలయ అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



