Kondagattu | ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. కాషాయమయమైన కొండగట్టు..!
Kondagattu | కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ అంజన్న భక్తులతో కళకళలాడుతుండగా.. పరిసరాలన్నీ కాషాయమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, దీక్షాపరులు భారీగా తరలివచ్చి ఆంజనేయుడి దర్శనం కోసం బారులు తీరారు.
Devotional | Published On May 12, 2026, 8.29 am IST
Kondagattu | కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ అంజన్న భక్తులతో కళకళలాడుతుండగా.. పరిసరాలన్నీ కాషాయమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, దీక్షాపరులు భారీగా తరలివచ్చి ఆంజనేయుడి దర్శనం కోసం బారులు తీరారు. ఉత్సవాల ప్రారంభ దినాన తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామి వారికి పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం నిర్వహించారు. యాగశాలలో స్థాపిత దేవతలకు హోమాలు నిర్వహించి, అనంతరం మహానివేదనతో తీర్థప్రసాదాలను భక్తులకు అందించారు.
జయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హనుమాన్ దీక్షాపరులతో ఆలయ పరిసరాలన్నీ ‘ఓం శ్రీరామ జయరామ జయ జయరామ’ నినాదాలు మార్మోగుతుండగా.. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. దీక్ష విరమణ కోసం వచ్చిన భక్తులు కల్యాణకట్ట భవనంలో మాల విరమణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నారు. పలువురు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జేఎన్‌టీయూ మార్గం మీదుగా వచ్చే వాహనాల కోసం బొజ్జపోతన్న గుడి వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కొండపై ‘వై’ జంక్షన్ వరకు భక్తుల రాకపోకల కోసం ఉచిత ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
సెప్టెంబర్ 22, 2026

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు
- ●Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?
- ●Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు

Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?

Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల



