త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mark Wood | వ‌రుస గాయాలు.. మార్క్‌వుడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Mark Wood | ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వరుస గాయాలతో గత ఏడాది కాలంగా ఆటకు దూరమైన 36 ఏళ్ల వుడ్‌.. ఇక టెస్టులు, వన్డేల్లో కొనసాగడం సాధ్యం కాదని వైద్యులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

P

Sports | Published On Sep 22, 2026, 9.55 pm IST

Mark Wood | వ‌రుస గాయాలు.. మార్క్‌వుడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
Advertisement

Mark Wood | ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వరుస గాయాలతో గత ఏడాది కాలంగా ఆటకు దూరమైన 36 ఏళ్ల వుడ్‌.. ఇక టెస్టులు, వన్డేల్లో కొనసాగడం సాధ్యం కాదని వైద్యులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2015లో న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వుడ్‌.. ఇంగ్లాండ్‌ తరఫున తనదైన ముద్ర వేశాడు. 38 టెస్టుల్లో 119 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు యాషెస్‌ సిరీస్‌ల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2015 యాషెస్‌లో ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్‌ సాధించి ఇంగ్లాండ్‌ విజయంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

ప్రపంచకప్‌ విజయాల్లో కీలక పాత్ర

2019 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టులో వుడ్‌ ముఖ్య సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో 18 వికెట్లు తీసిన అతడు.. గంటకు 95 మైళ్లకుపైగా వేగంతో బంతులు సంధిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 2022 టీ20 ప్రపంచకప్‌ సాధించిన ఇంగ్లాండ్‌ జట్టులోనూ వుడ్‌ ఉన్నాడు. ఆ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఇంగ్లాండ్‌ తరఫున 38 టీ20ల్లో 54 వికెట్లు తీసిన వుడ్‌.. ఆ దేశం తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 70 వన్డేల్లో 80 వికెట్లు సాధించాడు.

భావోద్వేగానికి గురైన వుడ్‌..

తన రిటైర్మెంట్‌ నిర్ణయంపై వుడ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. గాయాల నుంచి కోలుకుని మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు ఎంతో ప్రయత్నించానని, అయితే ఈసారి ఆ పోరాటాన్ని కొనసాగించలేకపోయానని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించాడు. వుడ్‌ వీడ్కోలుపై ఇంగ్లాండ్‌ పురుషుల క్రికెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ స్పందించాడు. యాషెస్‌ సిరీస్‌లతో పాటు రెండు ప్రపంచకప్‌ విజయాల్లో వుడ్‌ అందించిన సేవలను కొనియాడాడు. అతడి వేగం, పోరాట పటిమ ఇంగ్లాండ్‌ క్రికెట్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement