త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్‌ ఆవిష్కరణ

Srimad Bhagavad Gita | ప్రపంచ ప్రఖ్యాత గజల్‌ గాయకుడు డాక్ట‌ర్ గజల్‌ శ్రీనివాస్‌ రూపొందించిన ‘శ్రీమద్భగవద్గీత–ఆంగ్ల ఆడియో ఆల్బమ్‌’ను మారిషస్‌ రాష్ట్రపతి ధరమ్‌బీర్‌ గోకుల్‌ దంపతులు ఆవిష్కరించారు. మారిషస్‌లోని హరిహర దేవస్థానం–కళాజ్యోతి ప్రాంగణంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవద్గీతలోని 700 శ్లోకాలను గజల్‌ శ్రీనివాస్‌ స్వరపరిచి ఆలపించారు.

P

Telangana | Published On Sep 22, 2026, 9.40 pm IST

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్‌ ఆవిష్కరణ
Advertisement

Srimad Bhagavad Gita | ప్రపంచ ప్రఖ్యాత గజల్‌ గాయకుడు డాక్ట‌ర్ గజల్‌ శ్రీనివాస్‌ రూపొందించిన ‘శ్రీమద్భగవద్గీత–ఆంగ్ల ఆడియో ఆల్బమ్‌’ను మారిషస్‌ రాష్ట్రపతి ధరమ్‌బీర్‌ గోకుల్‌ దంపతులు ఆవిష్కరించారు. మారిషస్‌లోని హరిహర దేవస్థానం–కళాజ్యోతి ప్రాంగణంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవద్గీతలోని 700 శ్లోకాలను గజల్‌ శ్రీనివాస్‌ స్వరపరిచి ఆలపించారు. కోల్‌కతాలోని అద్వైత ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి స్వరూపానంద అందించిన ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా చేసుకుని ఆల్బమ్‌ను రూపొందించారు. గీతా తాత్పర్యాలకు పార్థసారథి ఆంగ్లంలో స్వరరూపం అందించారు.

ఈ సందర్భంగా మారిషస్‌ రాష్ట్రపతి ధరమ్‌బీర్‌ గోకుల్‌ మాట్లాడుతూ.. భగవద్గీత విశ్వమానవాళికి శాశ్వత జీవన గ్రంథమని పేర్కొన్నారు. డా. గజల్‌ శ్రీనివాస్‌ రూపొందించిన ఆంగ్ల ఆడియో ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గీతాభిమానులకు, ఆధ్యాత్మికతను అన్వేషించే వారికి ఉపయోగపడుతుందని అన్నారు. భగవద్గీతను ప్రపంచంలోని 100 భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గజల్‌ శ్రీనివాస్‌ చేపట్టిన గ్లోబల్‌ గీతా ఉద్యమాన్ని రాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమాన్ని బృందావన పార్థసారథి సమన్వయం చేసి నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రోడ్లు, భవనాల శాఖ మంత్రి అజయ్‌ గున్నెస్‌, ఆర్థిక శాఖ మంత్రి జ్యోతి జీతన్‌, దేశ ప్రధాన కార్యదర్శి సురేష్‌ సీబాలక్‌ తదితరులకు రాష్ట్రపతి ధరమ్‌బీర్‌ గోకుల్‌ శ్రీమద్భగవద్గీత ఆడియో పెన్‌డ్రైవ్‌లను అందజేశారు. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో డా. గజల్‌ శ్రీనివాస్‌ చేపట్టిన గ్లోబల్‌ గీతా మిషన్‌లో ఈ ఆంగ్ల ఆడియో ఆల్బమ్‌ ఆవిష్కరణ కీలక ఘట్టంగా నిలిచింది.

Advertisement
Advertisement