December 2026 Festivals | డిసెంబర్‌లో పండుగల సందడి.. వ్రతాలు, పర్వదినాల లిస్ట్ ఇదే..!
December 2026 Festivals | ఏడాదికి చివరి నెల డిసెంబర్.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో ఉత్పన్న ఏకాదశి, వివాహ పంచమి, మోక్షద ఏకాదశి, గీతా జయంతి, మార్గశిర పౌర్ణమి వంటి పలు ముఖ్యమైన పర్వదినాలు రానున్నాయి. వీటితో పాటు ప్రదోష వ్రతాలు, మాస శివరాత్రి, దత్తాత్రేయ జయంతి, అన్నపూర్ణ జయంతి వంటి విశేష రోజులు కూడా ఉన్నాయి.
Devotional | Published On Nov 29, 2026, 10.40 am IST
December 2026 Festivals | ఏడాదికి చివరి నెల డిసెంబర్.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో ఉత్పన్న ఏకాదశి, వివాహ పంచమి, మోక్షద ఏకాదశి, గీతా జయంతి, మార్గశిర పౌర్ణమి వంటి పలు ముఖ్యమైన పర్వదినాలు రానున్నాయి. వీటితో పాటు ప్రదోష వ్రతాలు, మాస శివరాత్రి, దత్తాత్రేయ జయంతి, అన్నపూర్ణ జయంతి వంటి విశేష రోజులు కూడా ఉన్నాయి. మరోవైపు డిసెంబర్ 16 నుంచి ఖర్మాస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, పర్వదినాల వివరాలు తెలుసుకుందాం..
మార్గశిర మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం
హిందూ సంప్రదాయంలో మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉంది. భగవద్గీతలోని విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన దివ్య విభూతులను వివరిస్తూ.. “మాసానాం మార్గశీర్షోహం” (మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని) అని పేర్కొన్నాడు. అంటే మాసాలన్నింటిలో మార్గశిర మాసం తనకు ప్రత్యేకమైనదని అర్థం. అందుకే ఈ మాసానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం, నదీస్నానాలు, ధ్యానం, మంత్రజపం, దానధర్మాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ నెలలో వచ్చే ఏకాదశులు, పౌర్ణమి, ఇతర పర్వదినాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
డిసెంబర్ 2026 వ్రతాలు, పండుగల పూర్తి జాబితా
డిసెంబర్ 1 : కాలభైరవ అష్టమి
డిసెంబర్ 4 : ఉత్పన్న ఏకాదశి
డిసెంబర్ 6 : రవి ప్రదోష వ్రతం
డిసెంబర్ 7 : మాస శివరాత్రి
డిసెంబర్ 8 : మార్గశిర అమావాస్య
డిసెంబర్ 14 : వివాహ పంచమి
డిసెంబర్ 16 : ధనుస్సంక్రాంతి
డిసెంబర్ 20 : మోక్షద ఏకాదశి
డిసెంబర్ 20 : గీతా జయంతి
డిసెంబర్ 21 : సోమ ప్రదోష వ్రతం
డిసెంబర్ 23 : మార్గశిర పౌర్ణమి
డిసెంబర్ 23 : శ్రీ దత్తాత్రేయ జయంతి
డిసెంబర్ 23 : అన్నపూర్ణ జయంతి
డిసెంబర్ 25 : క్రిస్మస్
డిసెంబర్ 26 : సంకష్టహర చతుర్థి
డిసెంబర్ 30 : కాలాష్టమి వ్రతం
డిసెంబర్ 31 : రుక్మిణి అష్టమి
డిసెంబర్ 16 నుంచి శూన్యమాసం..
హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు, మీన రాశుల్లో సంచరించే కాలాన్ని శూన్యమాసంగా పేర్కొంటారు. ఈ సమయంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు నిర్వహించడం సంప్రదాయబద్ధంగా నిషిద్ధంగా భావిస్తారు. అయితే పూజలు, దైవారాధన, మంత్రజపం, ధ్యానం, దానధర్మాలకు ఈ కాలం ఎంతో అనుకూలమైనదిగా చెబుతారు. పంచాంగ వివరాల ప్రకారం.. డిసెంబర్ 16న ఉదయం 10.29 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో శూన్యమాసం ప్రారంభమవుతుంది. 2027 జనవరిలో మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ కాలం ముగుస్తుంది. అందువల్ల డిసెంబర్‌లో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించాలనుకునేవారు శూన్యమాసం ప్రారంభం, ముగింపు తేదీలతో పాటు స్థానిక పంచాంగంలోని ముహూర్తాలను పరిశీలించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. డిసెంబర్ నెలలో పలు ఆధ్యాత్మిక విశేషాలు, పర్వదినాలు భక్తులకు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ముఖ్యంగా మోక్షద ఏకాదశి, గీతా జయంతి, మార్గశిర పౌర్ణమి వంటి రోజులు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mahesh Babu | సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. ఎందుకంటే?
- ●IND Vs NZ Test | రెండోటెస్ట్‌లో నుంచి ఆకాశ్‌దీప్ అవుట్.. సిరాజ్‌కు మళ్లీ మొండి చేయి!
- ●KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్
- ●Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?
- ●CM Ramesh | బీజేపీ ఎంపీ ఇంట్లో దొంగలు.. రూ.18 లక్షలు చోరీ
- ●Harish Rao | భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్: హరీశ్ రావు

Mahesh Babu | సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. ఎందుకంటే?

IND Vs NZ Test | రెండోటెస్ట్‌లో నుంచి ఆకాశ్‌దీప్ అవుట్.. సిరాజ్‌కు మళ్లీ మొండి చేయి!

KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్

Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?




