యూట్యూబ్‌లో వీడియో చూసి ఆపరేషన్ చేసి మహిళను చంపేశాడు
దీంతో ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వీళ్లు నిజమైన డాక్టర్లు కాదని, నకిలీ డాక్టర్లని పోలీసుల నిర్ధారించారు. గత కొన్నేళ్లుగా అనధికారికంగా క్లీనిక్‌ను నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ వచ్చాక అన్ని విషయాలు ఈజీగా తెలుస్తున్నాయి. యూట్యూబ్‌లో దొరకని సమాచారం ఉండదు. కానీ, దాన్ని మంచి కోసం వాడుకోవాలి కానీ చెడుగా వాడితే, తొందరపడితే ఇలాగే అవుతుంది. యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ చూసి ఓ నకిలీ డాక్టర్ ఓ మహిళకు ఆపరేషన్ చేశాడు. ఆ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరాబంకిలో చోటు చేసుకుంది.
ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తికి సరైన ఆథరైజేషన్ లేకున్నా శ్రీ దామోదర్ ఔషధాలయ అనే ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. అతడితో పాటు తన బంధువు కూడా అదే ఆసుపత్రిలో పని చేస్తుంటాడు. డిసెంబర్ 5న మునిశ్రా రావత్ అనే మహిళ ఈ ఆసుపత్రికి వచ్చింది. తనకు కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా కడుపులో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని చెప్పాడు. దాని కోసం సర్జరీ చేయాలని, రూ.25 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. దీంతో ఆ మహిళ భర్త ఆపరేషన్‌కు ముందే రూ.20 వేలు డిపాజిట్ చేశాడు.
ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేసుకున్నాక ఫుల్లుగా మద్యం తాగి యూట్యూబ్‌లో వీడియో చూసిన మిశ్రా ఆ మహిళకు ఆపరేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఆ మహిళ కడుపులో లోతుగా కత్తితో కోయడంతో ముఖ్యమైన నరాలన్నీ కట్ అయిపోయి ఆ మహిళ ప్రాణాలు విడిచింది.
దీంతో ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వీళ్లు నిజమైన డాక్టర్లు కాదని, నకిలీ డాక్టర్లని పోలీసుల నిర్ధారించారు. గత కొన్నేళ్లుగా అనధికారికంగా క్లీనిక్‌ను నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






