త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Man puts Armpit Hair in Food | బిల్లు ఎగ్గొట్టేందుకు చంక వెంట్రుకలు పీకి ఫుడ్‌లో వేసిన కస్టమర్.. ఆ తర్వాత ఏమైందంటే?

హోటల్‌లోని సీసీటీవీ కెమెరా చెక్ చేస్తే ఆ ఫ్యామిలీ బండారం మొత్తం బయటపడింది. ఆ ఫుటేజ్‌ని రెస్టారెంట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

J

Viral news | Published On Feb 16, 2026, 6.51 pm IST

Man puts Armpit Hair in Food | బిల్లు ఎగ్గొట్టేందుకు చంక వెంట్రుకలు పీకి ఫుడ్‌లో వేసిన కస్టమర్.. ఆ తర్వాత ఏమైందంటే?
Advertisement

Man puts Armpit Hair in Food | హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ ఫుల్లుగా మెక్కి ఆ తర్వాత బిల్లు ఎగ్గొట్టేందుకు కొందరు వెరైటీ ప్లాన్స్ వేస్తుంటారు. కొందరు కక్కేదాకా తిని ఫుడ్ బాగోలేదు.. బిల్లు కట్టను అంటూ రెస్టారెంట్ సిబ్బందిని బెదిరిస్తారు. మరికొందరు ఫుడ్‌లో పురుగులు పడ్డాయని, బొద్దింక వచ్చిందని అబద్ధాలు చెబుతారు. కొందరైతే వీళ్లే ఓ పురుగును పట్టుకొచ్చి ఫుడ్‌లో కలుపుతారు. ఇలా రకరకాలుగా బిల్లు ఎగ్గొట్టేందుకు రెస్టారెంట్ సిబ్బందిని బోల్తా కొట్టిస్తుంటారు. కానీ.. ఈ వ్యక్తి మాత్రం బిల్లు ఎగ్గొట్టడానికి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి ట్రిక్ చేసి ఉండరు. అసలు ఇలా కూడా చేయొచ్చా? అని ముక్కున వేలేసుకోవాల్సిందే.

తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ రెస్టారెంట్‌కి ఓ ఫ్యామిలీ వెళ్లింది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ కూడా సర్వ్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఓ వ్యక్తి మెల్లగా తన టీషర్ట్ లోపల చేయి పెట్టి చంకలోని వెంట్రుకలను పీకడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ వెంట్రుకలను ఫుడ్‌లో కలిపేశాడు. ఇదంతా ఎందుకు అంటారా? పీకల దాకా మెక్కి ఆ ఫుడ్ బిల్లు ఎగ్గొట్టడం కోసం మనోడు వేసిన ప్లాన్ అన్నమాట.

కాస్ట్‌లీ ఫుడ్ ఆర్డర్ చేసి మరీ

ఆ ఫ్యామిలీ కాస్ట్‌లీ ఫుడ్ ఆర్డర్ చేసిందట. ప్రీమియం ఫుడ్ ఆర్డర్ చేసి పీకల దాకా మెక్కిన తర్వాత ఫుడ్ బాగోలేదు.. వెంట్రుకలు వచ్చాయని చెప్పి బిల్లు పే చేయడానికి ఆ ఫ్యామిలీ నిరాకరించింది.

అరె.. ఫుడ్ క్లీన్‌గానే ఉంది. సర్వ్ చేసేటప్పుడు అంతా చెక్ చేసి సర్వ్ చేశాం. టేబుల్ కూడా క్లీన్‌గా ఉంది. అసలు వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చాయి.. అని డౌట్ వచ్చింది కానీ ఏమో సర్వ్ చేసేటప్పుడు పడిందేమో అని హోటల్ సిబ్బంది భావించారు. కస్టమర్ బిల్లు పే చేయడానికి నిరాకరించడంతో పోలీసులను పిలిచారు. దీంతో పోలీసులు కూడా కస్టమర్‌కే సపోర్ట్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు హోటల్ సిబ్బంది సీసీటీవీ కెమెరా చెక్ చేయలేదు. దీంతో కేవలం వాళ్లు తాగిన డ్రింక్స్‌కి మాత్రమే పే చేసి ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి తప్పించుకుంది.

ఆ తర్వాత హోటల్‌లోని సీసీటీవీ కెమెరా చెక్ చేస్తే ఆ ఫ్యామిలీ బండారం మొత్తం బయటపడింది. ఆ ఫుటేజ్‌ని రెస్టారెంట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Advertisement
Advertisement