త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Husband Murders Wife | “నేనే చంపేశా.. శవం దుప్పటిలో ఉంది”.. భార్య గొంతు పిసికి చంపి పోలీసులకు లొంగిపోయిన భర్త!

వెంటనే పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకుని చూడగా, బెడ్‌పై దుప్పటిలో చుట్టి ఉన్న మహిళా మృతదేహం కనిపించింది. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

J

Crime | Published On Jan 17, 2026, 5.45 pm IST

Husband Murders Wife | “నేనే చంపేశా.. శవం దుప్పటిలో ఉంది”.. భార్య గొంతు పిసికి చంపి పోలీసులకు లొంగిపోయిన భర్త!
Advertisement

Husband Murders Wife | సొంత భార్యను, భర్తను, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను చంపుకునే జనరేషన్‌లో బతుకుతున్నాం మనం. ఈ మధ్య ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో ఒక వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన నేరాన్ని అంగీకరించి లొంగిపోవడం స్థానికంగా కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం..22 ఏళ్ల సచిన్, శ్వేత.. ఇద్దరిదీ ఫతెపూర్ జిల్లాలోని మోహన్‌పూర్ గ్రామం. ఇరు కుటుంబాలు వీళ్ల పెళ్లిని ఒప్పుకోకపోవడంతో లేచిపోయి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సూరత్‌కి వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కాన్పూర్‌కి షిఫ్ట్ అయ్యారు. అక్కడే రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్నారు. సచిన్ ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే.. ఈ మధ్య సచిన్‌కి, శ్వేత మీద అనుమానం కలిగింది. దానికి కారణం.. శ్వేత బ్యాంక్ అకౌంట్లలో వేల రూపాయల డబ్బులు పడుతుండటం. ఎవరు పంపిస్తున్నారు అని అడిగితే.. మా నానమ్మ పంపిస్తోంది ఖర్చులకు అంటూ శ్వేత మాట దాటవేసేది. అందులోనూ తన ఇంటి పక్కనే కొందరు కాలేజీ కుర్రాళ్లు అద్దెకు ఉండటం కూడా ఆయన అనుమానానికి ఆజ్యం పోసినట్లయింది. అందుకే రెడ్ హ్యాండెడ్‌గా భార్యను పట్టుకోవాలని భావించి ఒకరోజు ఫోన్ చేసి తాను పార్టీకి వెళ్తున్నానని, రాత్రి ఇంటికి రాలేనని చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఇంటికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. తన భార్య ఇద్దరు కుర్రాళ్లతో పడుకొని ఉండటం చూసి తనతో గొడవ పెట్టుకున్నాడు. వెంటనే పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని సచిన్, శ్వేతకి కౌన్సిలింగ్ ఇచ్చారు.

అయినా కూడా సచిన్.. తన భార్యతో గొడవ పడ్డాడు. అలా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సచిన్, ఆమెపై దాడి చేసి గొంతు పిసికి ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత, మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి బెడ్‌పై పడేశాడు.

అనంతరం నిందితుడు నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న డ్యూటీ ఆఫీసర్‌ వద్దకు వెళ్లి, "సార్.. నేను నా భార్యను చంపేశాను. ఆమె శవం మా ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది. నన్ను అరెస్ట్ చేయండి" అని నిర్వేదంగా చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వెంటనే పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకుని చూడగా, బెడ్‌పై దుప్పటిలో చుట్టి ఉన్న మహిళా మృతదేహం కనిపించింది. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement