Ropeway Accident at Khallari Mata Temple | నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. మాత ఆలయం వద్ద తెగిన రోప్‌వే… మహిళ మృతి
ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Ropeway Accident at Khallari Mata Temple | ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో 17 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మహాసముంద్ జిల్లాల్లో ఉన్న ఖల్లారి మాత ఆలయం వద్ద ఉన్న రోప్‌వే కేబుల్ తెగడంతో దాని మీద ప్రయాణిస్తున్న వాళ్లు ఒక్కసారిగి కిందపడ్డారు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
3000 అడుగుల ఎత్తులో ఆలయం
నిజానికి ఈ ఆలయం 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాని మీదికి చేరుకోవడానికి అక్కడ రోప్‌వేను ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. చాలామంది భక్తులు ఆలయానికి వెళ్లి తిరిగి రోప్‌వే ఎక్కారు. భక్తులతో కిందికి వస్తున్న సమయంలో రోప్‌వే తెగడంతో ట్రాలీ ఒక్కసారిగా కిందపడింది. దీంతో ట్రాలీలో ఉన్న రాయప్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల ఆయుషి సత్కర్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆలయం నుంచి కిందికి వస్తుండగా, సుమారు 200 నుంచి 300 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు రోప్‌వే తెగి ట్రాలీ కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గత కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రస్తుతానికి ఖల్లారి ఆలయ రోప్‌వే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

Maoist Leader Papa Rao Surrender | 35 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర.. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు
మార్చి 24, 2026

Encounter | కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఫిబ్రవరి 19, 2026

CRPF | తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్.. 2 వేల మందితో కూంబింగ్
ఫిబ్రవరి 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



