త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CRPF | తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లో సీఆర్‌పీఎఫ్ భారీ ఆప‌రేష‌న్‌.. 2 వేల మందితో కూంబింగ్‌

CRPF | మార్చి చివ‌రి నాటికి దేశంలో మావోయిస్టులు (Maoists) అనేవారు లేకుండా చేయాల‌నే ల‌క్ష్యంతో కేంద్ర బ‌ల‌గాలు క‌దులుతున్నాయి. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో మావోయిస్టుల‌ను అంత‌మొందించిన సీఆర్‌పీఎఫ్ (CRPF) ద‌ళాలు.. ఇప్పుడు పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వంలో మిగిలిన వారిని టార్గెట్ చేసింది.

G

Telangana | Published On Feb 19, 2026, 9.03 am IST

CRPF | తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లో సీఆర్‌పీఎఫ్ భారీ ఆప‌రేష‌న్‌.. 2 వేల మందితో కూంబింగ్‌
Advertisement

CRPF | త్రినేత్ర‌.న్యూస్‌: మార్చి చివ‌రి నాటికి దేశంలో మావోయిస్టులు (Maoists) అనేవారు లేకుండా చేయాల‌నే ల‌క్ష్యంతో కేంద్ర బ‌ల‌గాలు క‌దులుతున్నాయి. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో మావోయిస్టుల‌ను అంత‌మొందించిన సీఆర్‌పీఎఫ్ (CRPF) ద‌ళాలు.. ఇప్పుడు పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వంలో మిగిలిన వారిని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతాల్లో భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. నంబీ, కోర్గోట‌లు కొండ‌ల రీజియ‌న్‌లో పెద్ద సంఖ్య‌లో బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. కేజీహెచ్‌-2 (KGH-2) పేరుతో ఆప‌రేష‌న్ చేప‌ట్టిన సీఆర్‌పీఎఫ్‌ 2000 మంది సిబ్బందితో అట‌వీ ప్రాంతాల‌ను జ‌ల్ల‌డ‌ప‌డుతున్న‌ది.

2025 జ‌న‌వ‌రి నాటికి 20 మందితో ఉన్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో, సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుల సంఖ్య‌ నాలుగుకు ప‌డిపోయింది. వారిలో సీనియ‌ర్ నాయ‌కులు గ‌ణ‌ప‌తి, దేవ్‌జీ, మ‌ల్లా రాజా రెడ్డి, మిసిరా బెస్రా ఉన్నారు. ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడైన దేవ్‌జీ అలియాస్ చేత‌న్‌, జూనియ‌ర్ కేడ‌ర్ అయిన కేసా సోధి కోసం గాలింపు చేప‌ట్టింది.

కాగా, 2025లో 12 మంది సీనియ‌ర్ నాయ‌కుల‌ను వివిధ ఎన్‌కౌంట‌ర్ల‌లో చ‌నిపోయారు. మ‌రో ఐదుగురు లొంగిపోయారు. సీఆర్‌పీఎఫ్ ఆప‌రేష‌న్ల‌లో 370 మంది మావోయిస్టులు మ‌ర‌ణించారు. మ‌రో 2391 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.

Advertisement
Advertisement