Sajjanar | ఎలాంటి నేరం చేసినా పట్టుకుంటాం: సీపీ సజ్జనార్
Sajjanar | నగరంలో ఎలాంటి నేరం (Crime) చేసినా పట్టుకుంటామని నగర పోలీస్ కమిషనర్ (Police Commissioner) వీసీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. అందుకే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర గణాంకాల వివరాలను ఆయన వెల్లడించారు.
వార్షిక నేర గణాంకాల విడుదల
Sajjanar | నగరంలో ఎలాంటి నేరం (Crime) చేసినా పట్టుకుంటామని నగర పోలీస్ కమిషనర్ (Police Commissioner) వీసీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. అందుకే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర గణాంకాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025లో జరిగిన అనేక ముఖ్యమైన ఘట్టాలను అందరి కృషితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేశామని చెప్పారు. పటిష్టమైన నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజుబుల్ పోలీసింగ్‌తో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని వివరించారు. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు.
నగరంలోని సీసీ కెమెరాలు, నిఘా విభాగంతో ఎలాంటి నేరం చేసినా పట్టుకుంటామనే స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గ్యాంగ్‌లు నగరానికి వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులపై నమ్మకం పెరగడంతో తమపై జరుగుతున్న నేరాలను మహిళలు, చిన్నారులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆ నేరాల సంఖ్య పెరిగిందని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల నిరోధంలో మ్యూల్ అకౌంట్స్ పెను సవాల్‌గా మారిందని అన్నారు. ఈ మధ్య కాలంలో 120 ఖాతాలను ఫ్రీజ్ చేస్తే వాటి ద్వారా రూ.24 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలిందని చెప్పారు. కానీ కేవలం రూ.16 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగామని పేర్కొన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానిపై సైతం కేసు నమోదవుతుందని చెప్పారు. డేంజరస్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల అనుమానం పెను భూతంగా హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, దానిని తట్టుకుని నిలబడితేనే ఫలితాలుంటాయన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి, వాహనాలు నడపకూడదని సూచించారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, జనవరి 1వ తేదీ వరకు అది కొనసాగుతుందని ప్రకటించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపుతామని హెచ్చరించారు. వేడుకలను జైలులో కాకుండా కుటుంబంతో జరుపుకోవాలని హితవు పలికారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






