Delhi Building Collapse | పేకమేడలా కుప్పకూలిన భారీ భవనం.. నెట్టింట భయానక వీడియో
దక్షిణ ఢిల్లీలోని సాకేత్ ఏరియాలో ఓ బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, కుప్పకూలుతున్న వీడియో భయాందోళన కలిగిస్తోంది.
Delhi Building Collapse | త్రినేత్ర.న్యూస్ : దక్షిణ ఢిల్లీ (South Delhi) సాకేత్ ఏరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం శనివారం రాత్రి ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 10 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్షణాల్లోనే నేలమట్టం.. వీకెండ్ కావడంతో తప్పిన పెను ముప్పు
వైరల్ అవుతున్న వీడియోలో.. భవనం పైభాగం నుంచి దుమ్ము రావడం గమనించిన స్థానికులు ప్రమాదాన్ని పసిగట్టి పరుగులు తీశారు. వారు చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఆ భారీ భవనం కుప్పకూలిపోయి దట్టమైన దుమ్ము కమ్మేసింది. ఆ భవనంలో ఓ కోచింగ్ సెంటర్, కొన్ని కేఫ్‌లు (Cafes), ఆఫీసులు ఉన్నాయి. పై అంతస్తులో జరుగుతున్న నిర్మాణ పనులే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

వీకెండ్ (Weekend) కావడంతో ఆఫీసులకు, కోచింగ్ సెంటర్ కు సెలవు ఉందని, అదే వర్కింగ్ డే అయితే సుమారు 200 నుంచి 300 మంది దాకా అక్కడ ఉండేవారని, ప్రాణనష్టం ఊహించని స్థాయిలో ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
16 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. ఆర్తనాదాలు
సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ రెస్క్యూ టీమ్స్ (Rescue teams), స్థానిక వలంటీర్లు రంగంలోకి దిగారు. హెవీ మెషినరీ, హైడ్రాలిక్ కట్టర్స్, స్నిఫర్ డాగ్స్, కెమెరాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రాత్రంతా గాలించారు. సుమారు 16 గంటల పాటు శ్రమించి 10 మందికి పైగా ప్రాణాలతో బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్స్‌కు తరలించారు.
"శిథిలాల కింద నుంచి రక్షించండి అంటూ ఆర్తనాదాలు వినిపించాయి.. ఆ భారీ దుమ్ము తగ్గాక చూస్తే పక్కనే ఉన్న క్యాంటీన్‌పై కూడా శిథిలాలు పడ్డాయి. ఆ క్యాంటీన్‌కు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కువగా వస్తుంటారు" అని ప్రత్యక్ష సాక్షులు భయాందోళన వ్యక్తం చేశారు.

ఓనర్‌పై క్రిమినల్ కేసు.. సీఎం సీరియస్
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) స్వయంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆమె ఆదేశాలతో మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సౌత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణకు కూడా సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, బిల్డింగ్ ఓనర్‌పై కల్పబుల్ హోమిసైడ్ (హత్యేతర నేరం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఇలాంటి ప్రమాదకర, పాత భవనాలను వెంటనే తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
दिल्ली के महरौली में जब चंद सेकेंड्स में ढह गई पांच मंजिला इमारत...
सामने आया खौफनाक वीडियो!#Saket #DelhibuildingCollapse #ViralVideo pic.twitter.com/VJDXSKacNJ— Arpit shukla ✍🏽 (@JournoArpit) May 31, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Delhi Building Collapse | పేకమేడలా కూలిన 4 అంతస్తుల పీజీ హాస్టల్.. శిథిలాల కింద విద్యార్థుల హాహాకారాలు
సెప్టెంబర్ 6, 2026

Delhi Govt | ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్‌ఫ్రం హోం.. సీఎం కీలక ప్రకటన
మే 14, 2026

Delhi Govt | ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రోలో ప్రయాణించండి.. ఢిల్లీ ప్రభుత్వం పొదుపుబాట
మే 14, 2026
తాజావార్తలు
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!
- ●Kayadu Lohar | పొడవాటి జడ.. ట్రెడిషనల్ లుక్.. కయదు అదుర్స్!

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం



